ఏపి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 పై సుప్రీం కోర్టులో విచారణ ముగించింది. దీనిపై సుప్రీం కోర్టు కీలక అదేశాలు జారీ చేసింది. ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ను ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచిస్తూ.. త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. జీవో నెం.1 పై జనవరి 24న విచారణ ముగించి ఏపి హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటి నుండి తీర్పు పెండింగ్ లో ఉన్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.

బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు ర్యాలీలు, ధర్మాలు జరపకుండా నిషేదిస్తూ ఏపి ప్రభుత్వం జీవో నెం.1 ను జారీ చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను విచారించిన ఏపి హైకోర్టు సీజే బెంచ్ విచారణ ముగించి తీర్పు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పు జాప్యం నేపథ్యంలో పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గత సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించగా, నేడు (సోమవారం) విచారణ జరుపుతామని సీజేఐ తెలిపారు. ఈ మేరకు నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు .. ఏపి హైకోర్టు సీజే బెంచ్ ను ఆశ్రయించాలని సూచించింది. విచారణ త్వరగా ముగించి తీర్పు ఇవ్వాలంటూ ఆదేశారు జారీ చేసింది.
Wrestlers Protest: తమ నిరసనకు మద్దతు ఇస్తారా..? వచ్చేయండి .. రాజకీయ పార్టీలకు రెజ్లర్ల స్వాగతం