Supreme Court: సుప్రీం కోర్టు కీలక సూచనలు..! చిన్న కేసులు ఎదుర్కొనేవారికి గుడ్ న్యూస్..! అవి ఏమింటే..?

Share

Supreme Court:  కరోనా మహామ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. సామర్థ్యానికి మించి ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. జైళ్లలో ఖైదీలూ కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలకు కీలక సూచనలు జారీ చేసింది.

Supreme Court key orders
Supreme Court key orders

ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష విధించదగిన నేరాల్లో నిందితులను అవసరమైతే తప్ప అరెస్టు చేయరాదని తెలిపింది. జైలులో ఉన్న ఖైదీలకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది. జైళ్లలో కరోనా సోకే అవకాశం ఉన్న ఖైదీలను అత్యవసరంగా గుర్తించాలని హైపవర్ కమిటీలను ఆదేశించింది. కరోనా మహమ్మారి నుండి బయటపడటం కోసం గత ఏడాది పెరోల్ మంజూరు చేసిన వారికి మరో 90 రోజుల సెలవు మంజూరు చేయాలని ఆదేశించింది. ఇటువంటి వారికి తగిన షరతులను కూడా విధించాలని చెప్పింది. విలువైన సమయాన్ని ఆదా చేయడం కోసమే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొంది.

ఏడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష విధించడానికి వీలులేని ఆరోపణలను ఎదుర్కొంటూ అండర్ ట్రయల్ ఖేదీలుగా ఉన్న వారికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడాన్ని పరిశీలించాలని సూచించింది. జైళ్లలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ఖైదీలకు, జైలు సిబ్బందికి రెగ్యులర్ గా కోవిడ్ టెస్ట్ లు చేయించాలనీ, అవసరమైన వారికి చికిత్సలు చేయించాలని తెలిపింది. అదే విధంగా ప్రతి రోజు పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది.  జైళ్లు కిక్కిరిసిపోవడం భారతదేశంతో పాటు అనేక దేశాలలో సాధారణ విషయంగా మారిందని పేర్కొంది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలు చిన్న చిన్న నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారికి గుడ్ న్యూస్‌యే. వివిధ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులను సైతం కోర్టుకు హజరు పర్చి రిమాండ్ కు పంపుతున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు చేసిన కీలక ఆదేశాలు ఆ వర్గాలకు ఊరట నిచ్చేవిగా ఉన్నాయి.

 


Share

Related posts

Ram charan : రామ్ ‌చ‌ర‌ణ్ బర్త్ డేకి ఆర్‌ఆర్‌ఆర్ నుంచి అదిరిపోయో సర్‌ప్రైజ్..!

GRK

Covid-19 : భారత్ లో కరోనా కల్లోలం..! వారంలో 70 శాతం పెరిగిన కొత్త కేసులు..!!

Muraliak

Raviteja : రవితేజ కాదు వరుణ్ తేజ్..?

GRK