Supreme Court: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సిఫార్సులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీఎస్‌టీ కౌన్సిల్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని జస్టిస్ చంద్రచూడా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. జీఎస్‌టీ పై చట్టాన్ని రూపొందించుకోవడానికి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు సమానమైన అధికారులు కల్గి ఉంటాయని కోర్టు వెల్లడించింది. అవసరమైతే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరుగా కూడా ప్రత్యేక చట్టాలను చేసుకోవచ్చని చెప్పింది.
ఆర్టికల్ 246 ఏ, 279 నిబంధనల ప్రకారం పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు ఉన్నాయని పేర్కొన్న కోర్టు..ఒకదానికొకటి స్వతంత్రంగా వ్యవహరించలేవని తెలిపింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దవద్దని సూచించింది. ఏకాభిప్రాయం రావడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
2007 లో ఐజీఎస్టీ చట్టం ప్రకారం సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్ పై సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఓడల్లో వస్తువుల రవాణా సేవలపై అయిదు శాతం ఐజీఎస్టీ విధించాలని 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా దాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ వ్యాజ్యం అప్పీలులో హైకోర్టు తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్పించింది.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…