NewsOrbit
జాతీయం న్యూస్

Supreme Court: సుప్రీం కోర్టులో ప్రొఫెసర్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్ .. మహారాష్ట్ర సర్కార్ షాక్

Supreme Court: ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని మహారాష్ట్ర సర్కార్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం .. హైకోర్టు ఉత్తర్వులు హేతుబద్దంగా ఉన్నట్లు ప్రాధమికంగా కనిపిస్తున్నాయని తెలిపింది. అయినప్పటికీ సర్కార్ అప్పీలును విచారణకు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే వీలైనంత తొందరగా ఈ పిటిషన్ ను లిస్టింగ్ చేయాలని మహారాష్ట్ర సర్కార్ తరపున హజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు చేసిన మౌఖిక విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. నిర్ణీత సమయంలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుందని చెప్పింది.

నిషేదిత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 90 శాతం వైకల్యంతో వీల్ చైర్ కు పరిమితమైన ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాను, మరో ఐదుగురిని మహారాష్ట్రా పోలీసులు 2014లో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను ఎన్ఐఏ దర్యాప్తు చేయగా, 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. సెషన్స్ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేయగా, దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2022 లో అక్టోబర్ లో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ వెంటనే జైలు నుండి విడుదలకు ఆదేశించింది.

అయితే ఈ తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఏప్రిల్ లో పక్కన పెట్టింది. నిందితుల అప్పీళ్లపై మళ్లీ మొదటి నుండి విచారణ జరపాలని సుప్రీం కోర్టు బాంబే హైకోర్టును ఆదేశించింది. ఆ ఆదేశాలతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు .. సాయిబాబా సహా మిగితా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ నెల (మార్చి) 5 న తీర్పు వెలువరించింది. దీంతో సాయిబాబా విడుదల అయ్యారు.

TDP – Janasena – BJP: సీట్ల కేటాయింపుపై చంద్రబాబు నివాసంలో కీలక నేతల భేటీ .. కాషాయ గూటికి చేరేందుకు సిద్దమైన ఓ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N