NewsOrbit
జాతీయం న్యూస్

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

Supreme Court: లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు ఇటీవలే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ కు మరో ఊరట లభించింది. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది.

Arvind Kejriwal

సీబీఐ, ఈడీ అరెస్టు చేసినందున సీఎం పదవిలో ఉండే హక్కు లేదంటూ కాంత్ భాటీ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 10న కొట్టివేసింది. అనంతరం పిటిషనర్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ తత్తాతో కూడిన సుప్రీం ధర్మాసనం .. ఆరోపణలు ఉన్నంత మాత్రన ఒక సీఎం ను తొలగించే చట్టపరమైన హక్కు ఏదీ లేదని స్పష్టం చేసింది.

ఆరోపణల నేపథ్యంలో సీఎం పదవి నుండి తొలగించాలని కోరడం న్యాయబద్దమైన విషయమని, కానీ దానికి చట్టపరమైన హక్కు లేదని తెలిపింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు ఇటీవల కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే సీఎంగా మాత్రం ఎలాంటి అధికారిక కార్యకలాపాలు చేపట్టరాదని షరతు విధించింది. జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది.

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N