సుప్రీంకోర్టులో పోల‌వ‌రం ప్రాజెక్ట్

Share

ఢిల్లీ జ‌న‌వ‌రి3 : సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై విచారణ జరిగింది. ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవనీ, స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ని పదే పదే నిలుపుదల చేశారని ఒడిశా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. సరైన సమాధానం కోసం రెండు ప్రభుత్వాలకు మూడు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.


Share

Related posts

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీకి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన పవన్..??

sekhar

రాజధాని ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐల చేయూత

somaraju sharma

కర్నాటక సీఎం నివాసానికి బాంబు బెదరింపు

Siva Prasad

Leave a Comment