ఢిల్లీ,జనవరి 4: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసుకు సంబంధించిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్.కె. కౌల్లతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు రానున్నది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తే దాఖలైన 14 వినతులపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం వుంది.
అయోధ్య వివాదంపై గతంలో దాఖలైన నాలుగు సివిల్ వ్యాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఈ వివాదానికి సంబంధించి మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోమి అఖాడా, రామ్లల్లాలకు సమానంగా పంచాలని తెలిపింది. ఈ తీర్పుపై దాఖలైన వ్యాజ్యాలను గత ఏడాది అక్టోబరు 29న సుప్రీం కోర్టు జనవరి నాలుగున విచారణ చేపడతామని తెలిపింది.
ఈ కేసులో అత్యవసర విచారణ చేపట్టాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ప్రధాన మంత్రి మోదీ సుప్రీం తీర్పుకోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు.