NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమిత్ షా స‌త్తా తేలిపోతుంది … మోడీ గెలుస్తారా?

రాజ‌కీయ చాణ‌క్యుడు అనే పేరున్న కేంద్ర హోం మంత్రి , బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా స‌త్తాకు ఇది గ‌ట్టి ప‌రీక్షే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కి ప‌రువు స‌మ‌స్య‌గా మారిన అంశంలో `షా` ఎత్తుగ‌డ‌లు ఫ‌లిస్తాయా? అనేది అంద‌రి దృష్టిని కేంద్రీక‌రించిన అంశం. ఇదంతా రైతుల ఆందోళ‌నల గురించి.

 

కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాలంటూ తమ ఉద్యమాన్ని రైతులు ఉధృతం చేస్తున్నారు. మంగ‌ళ‌వారం భార‌త్ బంద్‌ను సైతం నిర్వ‌హించారు. భారత్‌ బంద్‌కు కాంగ్రెస్, ఎన్‌సిపి, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకె, టిఆర్‌ఎస్, వాపక్షాలు సహా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ప్ర‌ధాన పార్టీల మ‌ద్ద‌తుతో ఆందోళ రూపం హీటెక్కింది. ఈ త‌రుణంలో అమిత్ షా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

రంగంలోకి అమిత్ షా

కొత్త చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ విష‌యంలో రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. రైతులతో ఐదు సార్లు కేంద్రం చర్చలు జరిపిన‌ప్ప‌టికీ ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రతీసారి చర్చలు అర్థాంతరంగానే ముగిశాయి. ఆ సమావేశాలకు వెళ్తున్న రైతు సంఘాల నేతలు.. ప్రభుత్వం ఏర్పాటు చేసే భోజనాలను కూడా స్వీకరించడం లేదు. వాళ్ల ఫుడ్‌ను వాళ్లే బయటి నుంచి తెప్పించుకుని తింటున్నారు. ఓవైపు తమ ఉద్యమంపై తప్పుడు ప్రచారం జరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. మొత్తంగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు వ్యక్తం అవుతున్న సమయంలో.. ఎలాగైనా రైతుల సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తోన్న సర్కార్.. ఆరో రౌండ్‌ చర్చలకు సిద్ధం అయింది. రైతు సంఘాల ప్రతినిధులతో నేడు చర్చలు జరపాల్సి ఉన్నప్ప‌టికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భార‌త్ బంద్ జ‌రిగిన మంగ‌ళ‌వారం రోజు రాత్రే రైతులను చర్చలకు ఆహ్వానించారు.

రైతు సంఘాలు ఏమంటున్నాయి ?

హోంమంత్రి స‌మావేశం నేప‌థ్యంలో రైతుల నాయకుడు రాకేష్‌ టికైట్ మీడియాతో మాట్లాడుతూ , “భారత్ బంద్‌లో భాగంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డు రావాణా మరియు రైలు ప్రయాణాలను తాకింది. అనేక రహదారులను దిగ్బంధం చేశారు. మార్కెట్లను మూసివేశారు. అన్నిరకాల వస్తు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో షా ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. ఢిల్లీ సమీపంలోని రహదారులపై నిరసన తెలిపే వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి ఈ సమావేశానికి హాజరవుతాం` అని వెల్లడించారు . కాగా, త‌క్ష‌ణం ప‌రిష్కారం దొరికినా లేదా త‌ర్వాత వెల్ల‌డైనా కూడా అమిత్ షా నిర్వ‌హించే ఈ స‌మావేశం రైతుల ఆందోళ‌న‌లో కీల‌క మెట్టుగా మారుతుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

author avatar
sridhar

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!