Surekha Vani: మన జీవితంలో లాగానే మనలిని ఎంతగానో అలరించే నటీనటుల జీవితాలలో కూడా ఒడిదుడుకులు మరియు మరెన్నో కష్టాలు ఉంటాయి. వారికి లోలోపల ఎన్ని కస్టాలు ఉన్న, కెమెరా ముందు నవ్వుతు కనిపిస్తారు. ఇటీవల సింగర్ రామ్ వీరపనేని ని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ తరహాలో త్వరలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూడా రెండవ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఎన్నో సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించారు సురేఖ వాణి. ముఖ్యంగా బ్రహ్మానందం వంటి కమెడియన్స్ పక్కన నటించి నవ్వులు పూయించారు. ఆమె తన కూతురు సుప్రీతా తో కలిసి తరచు సోషల్ మీడియా లో కనిపిస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. వయసు పెరుగుతున్నా ఆమె వన్నె ఏమాత్రం తగ్గడంలేదు.
అయితే సురేఖ వాణి జీవితంలో చోటు చేసుకున్న అతి పెద్ద విషాద సంఘటన ఏమిటంటే ఆవిడ భర్త మరణం. సురేఖ వాణి భర్త సురేష్ తేజ్ కు సినీ పరిశ్రమలో మంచి పేరు ఉంది. 2019 వ సంవత్సరంలో అనారోగ్యం కారణంగా సురేష్ తేజ మరణించారు.
వీరిది ప్రేమ వివాహం. ఆమె భర్త మరణం తరువాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా సురేష్ తేజ మరణం తరువాత ఆమెకు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఈ మధ్య సీనియర్ హీరోయిన్ లే క్యారెక్టర్ ఆర్టిస్టుల గానూ కనిపిస్తూ ఉండడంతో ఈమెకు ఆఫర్లు తగ్గిపోయాయి.
అయితే సురేఖవాణి మనసులోని బాధను గుర్తించిన ఆమె కూతురు మళ్ళీ పెళ్ళి చేసుకోమని అడుగుతుందట. సింగర్ సునీత బాటలోనే సురేఖ వాణి కూడా నడవనున్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?