సర్‌ప్రైజ్ ఇచ్చిన సుప్రీం హీరో ..షాకైన ఫ్యాన్స్ ..!

Share

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మంచి ఊపు మీదున్నాడు. వరసగా ఫ్లాపులు వచ్చి సతమమయిన ఈ సుప్రీం హీరో చిన్న గ్యాప్ తీసుకొని వరసగా ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. దీంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ సుప్రీం హీరో ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటించాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని బి. బాపినీడు సమర్పణలో.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

 

Sai Dharam Tej announces working in Sukumar-written mystical thriller

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా తర్వాత ‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్ట తో ఒక సినిమా మొదలుకాబోతుంది. మరో సినిమా ‘భగవద్గీత సాక్షిగా’ ..అన్న టైటిల్ తో రూపొందనుంది. గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు సాయి ధరమ్ తేజ్.

తన కెరీర్లో 15వ సినిమాని అధికారికంగా ప్రకటించి సర్‌ప్రై ఇచ్చాడు. కెరీర్ లో మొదటిసారి మిస్టికల్ థ్రిల్లర్ కథ తో సినిమా చేస్తు ప్రయోగం చేస్తున్నాడు. ‘భమ్ బోలేనాథ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ సినిమా మీద సాయి తేజ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. సుకుమార్ కాబట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమా ఒక ఆధ్యాత్మిక థ్రిల్లర్ అని సాయి తేజ్ అంటున్నాడు. ఇప్పుడే మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కిన సాయి తేజ్ కి ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.


Share

Related posts

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వాలి’

somaraju sharma

Roja: ఎమ్మెల్యే రోజా ని ఇబ్బంది పెడుతున్న ఆ ఆఫీసర్..??

sekhar

మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా రగిలిపోతున్నారట !

Yandamuri