Black Rice: నల్ల బియ్యం ప్రత్యేకత ఏంటో తెలుసా..!?

Share

Black Rice: నల్ల బియ్యం ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి.. అయినప్పటికీ వీటిని తినటానికి ఎక్కువగా మక్కువ చూపడం లేదు.. సాధారణ బియ్యం తో పోల్చితే ఈ బియ్యం లో పోషకాలు అధికంగా ఉన్నాయి.. ఈ బ్లాక్ రైస్ ను మన డైట్ లో భాగంగా చేసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Surprising Health Benefits Of Black Rice:
Surprising Health Benefits Of Black Rice:

Black Rice: నల్ల బియ్యంతో మహిళలకు మేలు..!!

ఈ బియ్యంలో ఉండే ఆంధోసైనిన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఇవి మహిళలలో వచ్చే క్యాన్సర్ (Cancer) ను అడ్డుకొంటుంది అని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ బియ్యం స్త్రీలలో వచ్చే అనేక రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి. ఈ బియ్యంలో ఉండే ఆంధోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి ఇ రోగ నిరోధక శక్తి (Immunity) ని పెంపొందిస్తాయి. శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్ వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. ఈ  బియ్యం ను మన డైట్ లో భాగం చేసుకోవడం వలన శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. గుండె (Heart) జబ్బు రాకుండా నియంత్రిస్తుంది. లివర్ డీటాక్సిఫికేషన్ లో ఈ బియ్యం తోడ్పడుతుంది. ఈ రైస్ తినడం వలన అధిక రక్తపోటు (BP) సమస్య నుంచి బయటపడవచ్చు.

Surprising Health Benefits Of Black Rice:
Surprising Health Benefits Of Black Rice:

నల్ల బియ్యం లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇంకా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, నియాసిన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ (Diabetes) ను నియంత్రిస్తుంది. ఈ బియ్యం తో వండిన ఆహారం తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. శరీరం లో ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. అధిక బరువు తో బాధపడుతున్న వారికి ఈ బియ్యం చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ బ్లాక్ రైస్ తినడం వలన త్వరగా ఆకలి వేయదు. దీంతో చిరుతిళ్లు జోలికి వెళ్లకుండా ఉంటారు. ఈ రైస్ తింటే సులువుగా బరువు తగ్గుతారు (Weight Loss).

Surprising Health Benefits Of Black Rice:
Surprising Health Benefits Of Black Rice:

ఈ బియ్యం తో అన్నం వండుకునేటప్పుడు గంజి వంచుకోవాలి. ఈ గంజి ని జుట్టు కుదుళ్లకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుకలు ఉడి పోకుండా ఉంటుంది. ఈ బియ్యం గంజిని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లటి నీటి తో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం పై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా తయారు చేస్తుది. నరాల బలహీనత (Nerve Weakness)  ఉన్న వారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు కేరళ ఆయుర్వేద వైద్యం లో ఉపయోగిస్తున్నారు.


Share

Related posts

Daily Horoscope జూన్‌ 28 ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha

BJP party: బీజేపీకి పొంచి ఉన్న పెద్ద గండం ఇదే..! దాటితే మూడేళ్లు ఢోకా లేనట్టే..!!

Yandamuri

water tap: ఇంట్లో వాటర్ టాప్ లీక్ అయితే వాస్తు ప్రకారం దోషమా?డబ్బు వృధాగా  ఖర్చు అవుతుందా? ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి !!

siddhu