NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌కు షాకిచ్చేందుకు రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్‌ ?

తెలంగాణ‌లో ఇప్పుడు అంతా ఎన్నిక‌ల సంద‌డి. ఇప్ప‌టికే నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల శాస‌న‌మండ‌లి ఉప ఎన్నిక పూర్త‌వడం, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సైతం పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల‌న్నీ తదుప‌రి ఎన్నిక‌ల‌పై దృష్టి పెడుతున్నాయి.

అయితే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం మాత్రం ఇప్ప‌టికే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకుంది. తమ వ్యూహాత్మ‌క కృషితో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు షాకివ్వ‌నున్న‌ట్లు ఆ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ ఏం చేస్తోందంటే….

దుబ్బాక ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంత కలిసికట్టుగా పని చేసినట్లుగానే.. గ్రేటర్‌ ఎన్నికల్లోనూ దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యనేతలు క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రేటర్‌లో డివిజన్ల వారిగా తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ… పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది కాంగ్రెస్ . ఇప్పటికే డివిజన్ల పరిధిలో వివిధ విభాగాలకు చెందిన కమిటీల ఏర్పాటు పూర్తి చేసిన కాంగ్రెస్ నేతలు … ఇంకా పెండింగ్ ఉన్న కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు పార్టీ డివిజన్ ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహిస్తూ… ఎన్నికల సందర్భంగా స్థానికంగా పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి కొత్త టార్గెట్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ , ఆయన పార్టీని టార్గెట్ చేయ‌డంలో ముందుండే మల్కాజ్ గిరి లోక్‌సభ స‌భ్యుడు , కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ క్రమంలో క్రియాశీలంగా ముందుకు సాగుతున్నారు. నియోజక వర్గం పరిధిలోని నగరపాలక సంస్థల డివిజన్ల పార్టీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగే అభ్యర్థులు ఎవరనేది పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా కృషి చేసి గెలిపించాలని రేవంత్ సూచించారు. అన్ని డివిజన్లకు చెందిన పార్టీ సీనియర్ నాయకులతో సమీక్ష లు నిర్వహిస్తూ స్థానికంగా ఏలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్న అంశంపై సలహాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ త‌ర‌ఫున‌ స్వయంగా సర్వే చేసుకుని.. బలమైన అభ్యర్థి ఎవరో గుర్తించి వారికి టికెట్ ఇస్తామ‌ని, త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఖాయ‌మ‌ని రేవంత్ రెడ్డి పార్టీ నేత‌ల‌తో పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

author avatar
sridhar

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N