NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

Telangana Lok Sabha Elections: తెలంగాణలో మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు అన్ని ఎన్నికల సమరానికి సిద్దం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగించి అత్యధిక స్థానాలు సాధించేందుకు వ్యూహాలను అమలు చేస్తొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది.

ఇదే క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఎక్కువ లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా, 14 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పని చేస్తొంది. బీజేపీ కూడా 8 నుండి పది లోక్ సభ స్థానాలు కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నుండి బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంది. బీఆర్ఎస్ నుండి చేరిన వారికి లోక్ సభ టిక్కెట్ లు ఇచ్చింది.

ఇప్పటికే చేవెళ్ల నుండి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. ఇవేళ చేవెళ్ల నుండి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మరో వైపు అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు బీజేపీ అభ్యర్ధులంతా విస్తృతంగా క్షేత్ర స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ దాదాపు మొత్తం అభ్యర్దులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.

ఈ నేపథ్యంల తెలంగాణలో ఏ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందో వెల్లడిస్తూ తెలంగాణ అవాజ్ అనే సంస్థ తన వీక్లీ సర్వేను విడుదల చేసింది. తెలంగాణ అవాజ్ సంస్థ ప్రతి వారం తమ సర్వే విడుదల చేస్తొంది. ఆ క్రమంలో ఈ వారం ఆ సంస్థ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజల ఓపీనియన్ తో సేకరించిన ఫలితాలను వెల్లడించింది. సదరు సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 29.8 శాతం, బీజేపీకి 28.6 శాతం, బీఆర్ఎస్ కు 24.3 శాతం, తటస్థులు 12,2 శాతం, ఇతరులు 4.9 శాతం ఓట్లు వస్తాయని  పేర్కొంది.

మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి 6 నుండి 8 సీట్లు, బీజేపీకి 5 నుండి 7 సీట్లు, బీఆర్ఎస్ 2 నుండి 4 సీట్లు, ఇతరులకు ఒక సీటు రాబోతోందని తెలిపింది. ప్రస్తుతం ఈ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఈ లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తుండగా, ఈ సర్వే ఆ పార్టీ నేతలకు షాక్ కు గురిచేసింది. అలానే ఈ సర్వే పట్ల కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసంతృప్తిని కల్గించింది.

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?