NewsOrbit
న్యూస్ సినిమా

Surya 40 : సూర్య 40 కూడా అదే జోనర్..మరో బ్లాక్ బస్టర్ పక్కా.!

Surya 40 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా సక్సెస్‌లకు దూరంగా ఉన్నాడు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా విజయాలను అందుకోలేకపోయాయి. అయితే ఎంతో కసితో బయోపిక్ సినిమాలో నటించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. తమిళంలో సూరారై పోట్రు, తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ తో వచ్చి భారీ విజయం అందుకుంది. కెప్టెన్ గోపీనాథ్ నిజ జీవితంలో జరిగిన అంశాల ఆధారంగా తయారైన కథతో రూపొందిన ఈ  సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఒకేసారి తెలుగు, తమిళంలో హిట్ అందుకున్న సూర్య తర్వాత క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. లేడీ డైరెక్టర్ సుధాకొంగర చేసిన మ్యాజిక్ తో సూర్య మళ్ళీ ఫాంలోకి వచ్చాడు.

surya-40-is also in same zoner...this is another block buster
surya 40 is also in same zonerthis is another block buster

ఇక తమిళ పాపులర్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ఆయన కెరీర్ లో 40వ సినిమా. మైల్ స్టోన్ మూవీ కావడంతో సూర్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. కాగా త్వరలో ఈ సినిమా నుంచి సూర్య ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది. సూర్యకు 40వ చిత్రం.. పాండిరాజ్ డైరెక్టర్ అనగానే అటు కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఊహించని విధంగా అంచనాలు నెలకొన్నాయి.

Surya 40 : సూర్య 40 ఈ సంఘటనల ఆధారంగానే తెరకెక్కబోతోందట

ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను దర్శకుడు పాండిరాజ్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో పొల్లాచ్చిలో చోటు చేసుకున్న సామూహిక అత్యాచారాల గురించి అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘటన ఎంతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు సూర్య 40 ఈ సంఘటనల ఆధారంగానే తెరకెక్కబోతోందని చెప్పుకుంటున్నారు. ఇందులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దుర్మార్గుల అంతం చూసే పాత్రలో సూర్య నటించబోతున్నాడట. ఇక జూలైలో టైటిల్ రిలీజ్ చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించారు చిత్ర బృందం.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?