Surya : సూర్య నిర్మాతగా కీర్తి సురేష్ మూవీ..హీరో మాత్రం చాలా చిన్నోడు

Share

Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి 2డి ఎంటర్‌టైన్మెంట్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. బయట నిర్మాతలతో పాటు ఆయన సొంత నిర్మాణ సంస్థలోనూ సినిమాలు నిర్మిస్తూ నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన గత చిత్ర ఆకాశం నీ హద్దురా కూడా సూర్య నిర్మాణ సంస్థలోనే తెరకెక్కి భారీ హిట్ సాధించింది. ఈ సినిమాకు ముందు సూర్య కి హిట్ దక్కి చాలా ఏళ్ళు అయింది. సూరారై పోట్రు అనే సినిమాతో మళ్ళీ సూర్య ఫాంలోకి వచ్చారు. తెలుగులో కూడా డబ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్ళను రాబట్టింది. దాంతో మళ్ళీ సూర్య జోరు పెంచాడు.

surya-as-producer-for-keerthy-suresh
surya-as-producer-for-keerthy-suresh

బయట నిర్మాణ సంస్థలతో పాటు తన సొంత నిర్మాణ సంస్థలోను సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సూర్య నిర్మాతగా ఓ సినిమాను నిర్మించనున్నట్టు తాజా సమాచారం. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సూర్య హీరోగా నటించడం లేదు. ఇదే ఇందులో షాకింగ్ న్యూస్. సూర్య కాకుండా కథ ప్రకారం అధర్వ మురళి హీరోగా నటిస్తున్నాడట. ఆయన సరసన మహానటి కీర్తిసురేశ్ నటించనుందని కోలీవుడ్ మీడియా లేటెస్ట్ సమాచారం. జాతీయ స్థాయిలో కీర్తి సురేశ్ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూకుడు మీదుంది.

Surya : ఈ సినిమాకు బాల దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది.

కీర్తి సురేశ్ ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్‌‌‌గా కొనసాగుతోంది. కీర్తి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో హీరోయిన్‌‌‌గా నటిస్తుంది. అలాగే తమిళ్‌‌‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇదే క్రమంలో సూర్య నిర్మిస్తున్న సినిమాలో కీర్తి హీరోయిన్‌‌‌‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత బాల దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది.


Share

Related posts

మన అమ్మమ్మ, నానమ్మల హెల్త్ సీక్రెట్!!!

Kumar

నిఖిల్‌కు బాలీవుడ్ సంస్థ అండ‌

Siva Prasad

నాగ శౌర్య సినిమాలో రకుల్ ప్రీత్ .. డామినేట్ చేస్తుందంటున్న ఫ్యాన్స్ ..?

GRK