Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి గత చిత్రం ఆకాశమే నీ హద్దురా సినిమాకి ముందు కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. నంబర్ వన్ స్థానంలో ఉన్న సూర్య ఒక్కసారిగా రేస్‌లో వెనకబడిపోయాడు. ఈ గ్యాప్‌లో అజిత్, విజయ్, ధనుష్ మంచి క్రేజ్‌తో దూసుకు వచ్చారు. అయితే ఆకాశం నీ హద్దురా సినిమా తర్వాత సూర్య మళ్ళీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా ఓటీటీలో డీల్ కుదుర్చుకొని రిలీజ్ చేశాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకొని సూర్యకి భారీ లాభాలను తీసుకువచ్చింది. దాంతో అటు నిర్మాతగా, ఇటు హీరోగా మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో తన నెక్స్ట్ సినిమాలను కమిటయ్యాడు. అయితే ఒకటో రెండో సినిమాలను సైన్ చేశాడని అందరూ భావించారు. కానీ ఆయన బర్త్ డే సందర్భంగా తాజాగా ఆయన నటిస్తున్న 5 క్రేజీ ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాడు. ఆకాశమే నీ హద్దురా సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈమూవీకి సూర్య నిర్మాత. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తాడని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. మరో వైపు నాలుగు సినిమాలు ఒక వెబ్ సిరీస్ లో నటుస్తున్నాడు సూర్య. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.
Surya : ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా జై భీమ్ అనే సినిమాను చేస్తున్నట్టు ప్రకటించిన సూర్య టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. సామాజిక అంశంతో ఈ సినిమా తయారవుతోంది. తాజాగా వదిలిన లుక్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ‘ఎతార్కుమ్ తుండివన్’.. వడివసాల్ సినిమాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు సూర్య. విజయ్ మాస్టర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. ఈ క్రమంలో మిగతా కోలీవుడ్ హీరోలు కూడా ఆ రేంజ్ అందుకోవాలని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సూర్య కూడా తన ప్రాజెక్ట్స్ అన్నీ పాన్ ఇండియన్ రేంజ్ మూవీస్ నే ఎంచుకుంటున్నాడు. ఆ దిశగానే భారీ బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఇక సినిమాలతో పాటు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నవరస అనే వెబ్ సిరీస్ లోనూ కనిపించబోతున్నాడు. ఇలా రానున్న రెండేళ్ళలో సూర్య భారీ ప్రాజెక్ట్స్ తో పాటు వెబ్ సిరీస్ లతో సందడి చేయబోతున్నారు. ఇక తెలుగులో కూడా సూర్య స్ట్రైట్ సినిమాను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. చూడాలి మరి సూర్య టాలీవుడ్ లో ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారో.