Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనోడు ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ మాత్రమే కాదు. సెలబ్రిటీ కూడా. షణ్ముఖ్ జస్వంత్ కు సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. తను ఏం చేసినా ఓ సంచలనమే. అదే షణ్ముఖ్ స్పెషాలిటీ. తనకు యూట్యూబ్ లో ఓ చానెల్ కూడా ఉంది. ఆ చానెల్ కు మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు.

ఇప్పటికే షణ్ముఖ్ జస్వంత్ నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ద్వారానే షణ్ముఖ్ కు మంచి పేరు వచ్చింది.
తర్వాత తాజాగా సూర్య వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు షణ్ముఖ్. యూట్యూబ్ లో షణ్ముఖ్ ఏ వెబ్ సిరీస్ ను విడుదల చేసినా.. అది సంచలనాలను సృష్టించాల్సిందే. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండాల్సిందే.
Shanmukh Jaswanth : సూర్య వెబ్ సిరీస్ నాలుగో ఎపిసోడ్ కూడా విడుదలైంది
ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ విడుదలై యూట్యూబ్ లో సంచలనాలను సృష్టించాయి. తాజాగా నాలుగో ఎపిసోడ్ విడుదలై యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
ఇంజనీరింగ్ పూర్తయి ఖాళీ ఖాళీగా ఉంటూ ఉద్యోగం లేకుండా ఫ్రెండ్స్ తో తిరగే ఓ మధ్య తరగతి కుర్రాడిగా షణ్ముఖ్ నటించి అందరి మన్ననలను పొందాడు. సూపర్ డూపర్ గా షణ్ముఖ్ నటించి అందరి ప్రశంసలు పొందాడు.
ఇంకెందుకు ఆలస్యం… తాజాగా విడుదలైన సూర్య వెబ్ సిరీస్ నాలుగో ఎపిసోడ్ ను మీరు కూడా చూసేయండి.