NewsOrbit
న్యూస్

సుశాంత్ సూసైడ్ ముందు పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ లో ఏముంది?

బాలీవుడ్ వ‌ర్ధ‌మాన న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ (34) ఆత్మ‌హ‌త్యకి గ‌త కొద్ది రోజులుగా అత‌ను అనుభ‌విస్తున్న డిప్రెష‌నే కారణమని తెలుస్తోంది. ముంబైలో గ‌త కొద్ది నెల‌లుగా ఒంట‌రిగా ఉంటున్న సుశాంత్ ఆదివారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఉంటున్నాడు.అత‌ను చివ‌రిసా‌రిగా ఇన్‌స్టాగ్రాంలో త‌న త‌ల్లిని బాగా మిస్ అవుతున్న‌ట్లు పోస్ట్ పెట్టాడు. అందులో అత‌ను చాలా బ‌రువైన ప‌దాల‌ను ఉప‌యోగించాడు.

వాటిని బ‌ట్టి చూస్తే త‌న త‌ల్లి గుర్తుకు వ‌చ్చి ఉంటుంద‌ని.. దాంతోపాటు గ‌త కొంత కాలంగా ఒంట‌రిగా ఉండ‌డం వ‌ల్ల వ‌చ్చిన డిప్రెష‌న్‌తో.. తీవ్ర మ‌న‌స్థాపానికి గురై సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటాడ‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే సుశాంత్ మాజీ మేనేజరు దిశ స‌లియ‌న్ 14 అంత‌స్థుల ఓ భ‌వ‌నంపై నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆ సంఘ‌ట‌నను మ‌రువ‌క ముందే ఇప్పుడు సుశాంత్ ఇలా ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే అస‌లు అత‌ని ఆత్మ‌హ‌త్య‌కు గల క‌చ్చిత‌మైన కార‌ణాలు మాత్రం ఇంకా తెలియలేదు.


సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఇలా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌డం బాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌నే కాదు, యావ‌త్ భార‌త సినీ ప్రేక్ష‌కుల‌ను విచారంలోకి నెట్టేసింది.సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ పాట్నాలో జ‌న్మించాడు. అత‌నికి 16 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు 2002లో త‌ల్లి చ‌నిపోయింది. దీంతో తండ్రి సంర‌క్ష‌ణ‌లో అన్న‌, సోద‌రిల‌తో క‌ల‌సి అత‌ను పెరిగాడు. అత‌ని అన్న నీర‌జ్ కుమార్ బ‌బ్లూ అక్క‌డ ఎమ్మెల్యే. అత‌ని వ‌దిన బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే సుశాంత్ సింగ్ సినిమాల్లోనే కాదు.. చ‌దువుల్లోనూ దిట్టే. ఏఐట్రిపుల్ఈలో ఆలిండియా లెవ‌ల్‌లో 7వ ర్యాంకును సాధించాడు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానిక‌ల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు. ఫిజిక్స్‌ ఒలంపియాడ్ గెలుచుకున్నాడు. త‌రువాత ప‌విత్ర రిష్తా అనే సీరియ‌ల్‌లో లీడ్ రోల్‌లో న‌టించాడు. అనంత‌రం అభిషేక్ క‌పూర్ తీసిన కోయిపొచె సినిమా ద్వారా అత‌ను బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యాడు.

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పూత్.. మ‌హేంద్ర సింగ్ ధోని బ‌యోపిక్‌.. ఎంఎస్ ధోనిలోనూ న‌టించి అంద‌రి మెప్పు పొందాడు. అలాగే ప‌లు హిట్ సినిమాల్లోనూ అత‌ను న‌టించాడు. 2019లో చివ‌రిసారిగా అత‌ను చిచోరే మూవీలో న‌టించాడు. ఏదేమైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక వర్ధమాన నటుడు అర్ధాంతరంగా అసువులు బాయడం ఎంతైనా శోచనీయం.

author avatar
Yandamuri

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!