ఇండియాలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ గురించి తెలియని వారుండరు. దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ గా పేరు సంపాదించుకుంది. ఈ-కామర్స్ రంగంలో అది పెద్ద కంపెనీగా అవతరించింది. ఫ్లిప్ కార్ట్ లో దొరకని వస్తువంటూ ఏది ఉండరు. ప్రతి వస్తువుల లభిస్తుంది. డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అందుకే ఇండియాలోని ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ లలో ఫ్లిప్ కార్ట్ తొలి స్థానంలో ఉంది. అమెజాన్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ రాణిస్తోంది,
వివాదాల్లో ఫ్లిప్ కార్ట్
అయితే ఫ్లిప్ కార్ట్ ఎంత పాపులర్ అయిందో.. వివాదాలు కూడా అలాగే ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ బుక్ చేసుకుంటే.. వేరే ప్రొడక్ట్ రావడం, బుక్ చేసుకున్న ప్రొడక్ట్ రాకుండా వింత వస్తువులు రావడం లాంటివి తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. అయితే ఫ్లిప్ కార్ట్ తర్వాత తమ తప్పును తెలుసుకుని కస్టమర్ కు నష్టం జరగకుండా చూసుకుంటోంది.
సుశాంత్ సింగ్ ఫొటోతో టీ షర్ట్
అయితే తాజాగా ఫ్లిప్ కార్ట్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ టీ షర్ట్ పై హీరో సుశాంత్ ఫొటోతో పాటు డిప్రెషన్ ఈజ్ డ్రోయింగ్ అనే ట్యాగ్ లైన్ ను జోడించింది. దీనిపై సుశాంత్ అభిమానులు ఫైర్ అవుతన్నారు. ఫ్లిప్ ార్ట్ ను బ్యాన్ చేయాలని కోరుతున్నారు. వెంటనే ఆ ఫొటోలను తొలగించాలని కోరుతున్నారు. ఓ సుశాంత్ అభిమాని దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. బాయ్ కాట్ ఫ్లిప్ కార్ట్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
మండిపడుతున్న సుశాంత్ ఫ్యాన్స్
అన్ని ఈ-కామర్స్ సైట్ల నుంచి ఈ టీ షర్ట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం ఇలా చీప్ ట్రిక్ లు పాటించడంపై అభిమానులు మండిపడుతున్నారు. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం ఇంత బరితెగిస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. తవ వస్తులను అమ్ముకోవడం కోసం ఇంత దిగజారుతారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ కి ఎందుకింత పైత్యం అంటున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఆపాలని, చనిపోయిన వ్యక్తి ఫొటోను టీ షర్ట్ పై పెట్టడమే కాకుండా అలాంటి కోట్ ను యాడ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.