అనుమానాస్పద బాక్స్ స్వాధీనం

విజయవాడ, జనవరి 21: విజయవాడలో అనుమానాస్పద బాక్స్‌ను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుండి బాక్స్ విజయవాడకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాక్సులో ఇరీడియం, యూరేనియం మెటీరియల్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
సోమవారం బాంబు స్కాడ్‌ను తీసుకువచ్చి బాక్సు‌ను వేరే నిర్జన ప్రదేశానికి తీసుకువెల్ళి పరిశీలించారు. దీనికి సంబంధించిన 20 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనిని ఐదు లక్షలకు కొనుగోలు చేసినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తుల్లో వెల్లడైయింది. రైస్ పుల్లింగ్ బ్యాచ్‌గా వీరిని అనుమానిస్తున్నారు.
క‌ృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు సోదాలు జరుపుతుండగా బాక్స్‌ను ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.