21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెక్కి..? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

Share

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కి నిర్వహిస్తున్నారన్న అభియోగంతో అయన భద్రతా సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. రెండు రోజులుగా కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, పార్టీ కార్యాలయం దగ్గర అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు సంచరిస్తూ పవన్ కళ్యాణ్ కదలికలను పరిశీలిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. పవన్ వాహనాన్ని అనుసరిస్తున్న వాళ్లు అభిమానులు కారని చెప్పారు.

Pawan Kalyan

సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు వచ్చి భద్రత సిబ్బందితో గొడవ పెట్టుకున్నారని, సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆ తర్వాత మంగళవారం, బుధవారం కూడా పవన్ కళ్యాణ్ వాహనాలను ఒకరోజు కారులో, తర్వాత రోజు బైకులపై అనుసరించారని తెలిపారు. పవన్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆ గుర్తు తెలియని వ్యక్తులు గొడవ పడుతున్న వీడియోను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ఈ ఈ ఘటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : “వాడు వేస్ట్… ఇంట్లో కనీసం ఎవరూ దేకరు…!” పాపం…. అతనిని కించపరిచిన హారిక!

arun kanna

అభ్యర్థిని ఒప్పించడానికి ఆపసోపాలు : టీడీపీ లో నిస్తేజం

Special Bureau

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారా? మీ పంట పండినట్లే: చరిత్ర తిరగరాసిన దలాల్ స్ట్రీట్

Special Bureau