YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవేళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే విచారణ తేదీకి ఒక రోజు ముందు అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఇవేళ విచారణకు ఆయన హజరు అవుతారా లేదా.. హైకోర్టు నుండి ఏమైనా ఊరట లభిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ముందు అవినాష్ రెడ్డి రెండు పర్యాయాలు సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు. అయితే ఆ సమయంలో అవినాష్ రెడ్డి సీబీఐ నోటీసులపై కోర్టును ఆశ్రయించలేదు. మూడవ సారి కూడా విచారణకు హజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేయడం, అరెస్టు చేయవచ్చు అన్న ప్రచారం జరుగుతుండటంతో అవినాష్ రెడ్డి అనూహ్యంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినందున సీబీఐ బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి హైకోర్టును కోరారు. సీబీఐ జరిపే విచారణను మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని అవినాష్ రెడ్డి కోరారు. ఇదే సందర్భంలో సీబీఐ అధికారుల దర్యాప్తు తీరును తప్పుబడుతూ వారిపై ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డి పిటిషన్ పై ఇవేళ హైకోర్టులో విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హజరు అవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అవినాష్ రెడ్డి న్యాయవాది వాదనలపై కోర్టు ఏ విధంగా స్పందించి ఉత్తర్వులు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి 12వ తేదీన కడపలో సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరు కావాల్సి ఉంది.
AP Skill Development case: నోయిడాకు వెళ్లి అరెస్టు చేసి తీసుకువస్తే ..సీఐడీ కోర్టు కీలక ఆదేశాలు