బస్టాండ్‌లో లైంగిక వేధింపులు

తిరుపతి, జనవరి6: నగరి మాజీ మున్సిపల్ కమిషనర్ బాలాజీ యాదవ్ బస్టాండ్‌లో యువతిపై దాడికి యత్నించారు. ఆదివారం ఉదయం నగరి బస్టాండ్‌లో యువతిపై దాడికి యత్నించిన బాలాజీని ప్రయాణికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.

బాలాజీ తనను ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని యువతి తెలిపింది. బాలాజీ యాదవ్ నగరి మున్సిపాలిటిలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గతంలో సస్పెండ్ అయ్యారు.