AP Assembly: ఏపి శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సభ్యుల ప్రశ్నలపై మంత్రులు సమాధానాలు ఇస్తుండగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

దీంతో పాటు జీవో నెంబర్ వన్ ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు వెల్ లోకి దూసుకువెళ్లడంతో స్పీకర్ తమ్మినేని .. టీడీపీ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పిటికే స్పీకర్ పోడియం వద్ద రెడ్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు రూలింగ్ ఇచ్చారు. అది దాటి వచ్చిన వారందరినీ సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు.
ఈ వేళ ప్రశ్నోత్తరాల అనంతరం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మేరుగ నాగార్జన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
ఫలించిన చంద్రబాబు వ్యూహం.. ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ