NewsOrbit
న్యూస్

Omicrone: శ్రీకాకుళం జిల్లాలో ఒమైక్రాన్ కలకలం..!!

Omicrone: దేశంలో ఒమైక్రాన్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుండటంతో అది ఒమైక్రాన్ వేరియంట్ అయి ఉండవచ్చని భయాందోళనలు చెందుతున్నారు. దాదాపు ఇప్పటి వరకూ 30 దేశాలలో ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇతర దేశాల నుండి వచ్చే వాళ్లకు విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నా కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఒమైక్రాన్ కేసులకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఓ వ్యక్తికి ఒమైక్రాన్ సోకింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది.

suspicious Omicron cases in srikakulam dist
suspicious Omicron cases in srikakulam dist

Omicrone: దక్షిణాఫ్రికా నుండి రావడంతో

విషయంలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఒ వ్యక్తి గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుండి వచ్చాడు. అతనికి విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో అతను ఇంటికి వచ్చేశాడు. అయితే అతను ఇంటికి వచ్చిన తరువాత జ్వరం రావడంతో ఈ నెల 5వ తేదీన స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మరో సారి పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే అతను దక్షిణాఫ్రికా నుండి రావడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. అతనికి సోకింది ఒమైక్రాన్ అయి ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వైద్యాధికారులు అతని నుండి సేకరించిన బ్లడ్ సాంపిల్స్ ను హైదరాబాద్ లోని సీసీఎంబీ ల్యాబ్ కు పంపించారు. అక్కడ నుండి నివేదిక రావాల్సి ఉంది. వైద్యుల సూచనల మేరకు సదరు బాధితుడు, అతని కుటుంబ సభ్యులు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. దీనిపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లఠ్కర్ స్పందించారు. ఆ వ్యక్తికి సోకింది ఒమైక్రానా కాదా అనేది నివేదిక వచ్చిన తరువాత తెలుస్తుందని అన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju