SVP: ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్తడే కావటంతో.. సోషల్ మీడియాలో అభిమానులు అదే రీతిలో ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ హీరోల సినిమాల అప్డేట్ లు ఇటీవల రావడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా కి సంబంధించిన పోస్టర్ కూడా వారం క్రితం రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో పోస్టర్ తో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డులు 24 గంటల్లో సృష్టించారు.
అయితే ఇప్పుడు మహేష్ బర్తడే సందర్భంగా “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ సరికొత్త ట్రీట్ ఇచ్చే రీతిలో రెడీ అవ్వడం జరిగింది. విషయంలోకి వెళితే నిమిషానికి పైగా నిడివి కలిగిన టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా తొమ్మిది గంటల 9 నిమిషాల కు.. ఈ టీజర్ రిలీజ్ కానుంది. ఈ సమయములో టీజర్ లో మహేష్ చాలా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో డైలాగు చెప్పనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
ముఖ్యంగా సినిమా లో కొత్త తరహా గెటప్ లో అప్పట్లో “అతిధి” సినిమా మాదిరిగా ఉండటంతో పాటు మెడపై రూపాయి టాటో ఉండటంతో.. ఎటువంటి కాన్సెప్టుతో సినిమా తెరకెక్కుతోంది అన్నది ఎప్పటినుండో సస్పెన్స్ గా ఉంది. అయితే మరి కొద్ది గంటల్లో టీజర్లో సినిమా స్టోరీ తెలుస్తుందేమో అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టీజర్ తో… సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని మహేష్ బాబు అభిమానులు ఇప్పటి నుండే.. మహేష్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మహేష్ “సర్కారు వారి పాట” టీజర్ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.