Swara Bhasker: హీరోయిన్ కు కరోనా.. చనిపోవాలంటూ కామెంట్స్.!

Share

Swara Bhasker: ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ రూపంలో జనులను వేధిస్తోంది. అవును.. కరోనా ఓమిక్రాన్ అవతారమెత్తి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మొన్నటి వరకూ ఇండియాలో కేసులు అంతంత మాత్రమే కాగా ఇపుడు రోజు రోజుకీ పెరిగి పోతున్న కరోనా కేసులు ప్రజలను భయ పెడుతున్నాయి. నిన్న 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు రెట్టింపు అయ్యాయి. దాదాపు ఒక లక్షకు పైనే ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం మనం గమనించవచ్చు. అందులో పిల్లలే 20 శాతం వుంటాయని గణాంకాలు చెబుతున్నాయి.

Swara Bhasker: ఇటీవల కరోనా సోకిన ప్రముఖులు వీరే..

టాలీవుడ్ అందగాడు, సూపర్ స్టార్ మహేష్ బాబుకి నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతగాడు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాడు. అలాగే పవర్ స్టార్ భక్తుడు, హీరో నితిన్ భార్యకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడం మనకు తెలిసినదే. ఈ కోవలోనే బాలీవుడ్ హీరోయిన్ ఐనటువంటి స్వర భాస్కర్(Swara Bhasker)కు తాజాగా కరోనా నిర్ధారణ అవ్వడం బాధాకరం. ఇదే భాధ కలిగించిన విషయం అయితే తనని చనిపోవాలంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఇంతకన్నా బాధాకరం.

స్వర భాస్కర్ పైన వస్తున్నా ట్రోల్స్ ఇవే..

సోషల్ మీడియా వలన ఎంత మంచి జరుగుతుందో అంతకంటే ఎక్కువగా చెడు జరుగుతుంది అనడానికి ఇది ఓ ఉదాహరణ అని చెప్పుకోవాలి. లేకపోతే ఓ వైపు కరోనా సోకి తాను, తన కుటుంబ సభ్యులు బాధపడుతుంటే.. ఆ వెధవలు అలా ట్రోల్స్ చేయడం ఖచ్చితంగా నేరమే. అంతటితో ఆగకుండా ఈ కొత్త సంవత్సరంలో వారు విన్న గుడ్ న్యూస్ ఇదేనంటూ మెసేజెస్ పెట్టడం కొసమెరుపు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : ఇది ఊహించని మలుపు – స్టార్ మా కూడా అనుకోలేదు ఇలా .. వాయిదా దిశగా బిగ్ బాస్ ?

siddhu

KRMB: బిగ్ బ్రేకింగ్..జల వివాదాల నేపథ్యంలో ఏపి, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు కీలక ఆదేశాలు

somaraju sharma

Big Breaking : చంద్రబాబుకు హైకోర్టులో ఊరట…సీఐడి విచారణపై స్టే

somaraju sharma