శిద్దా టు జగన్… వయా స్వరూపానంద లీల …!

Share

శిద్దా పెత్తనం చెలాయించడాన్ని ఇప్పుడు ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలు ఏవీ ఖాళీగా లేవు…!
కుమారుడికి ఆధిపత్యం ఇవ్వడానికి దర్శి, మార్కాపురం, ఒంగోలు ఏవీ ఖాళీగా లేవు…!
నామినేటెడ్ పదవి ఇస్తామని ఏమి హామీ దక్కలేదు…!
గ్రానైట్ లో ఫైన్ తగ్గింపుపై పూర్తిస్థాయిలో హామీ లభించలేదు…!
ఇలా శిద్దా అనుకున్న కోరికలు ఏమీ నెరవేరలేదు, జగన్ నుండి ఏమి హామీలు రాలేదు. కానీ శిద్దా రాఘవరావు వైసిపిలో చేరిపోయారు, జగన్ సాదరంగా ఆహ్వానించారు. దీనిలో మూల కారణం ఏంటా అని ఆరా తీస్తే ఇద్దరికీ ఒక వేదిక కనిపించింది.. అదే స్వరూపానందుడి లీల. ఆయన ఒక్క మాటతో ఈ కార్యాన్ని పూర్తి చేయించారు.

శిద్దా పరమ భక్తుడు…!

శిద్దా రాఘవరావు వీర భక్తుడు. అన్ని రకాల పూజలు చేస్తుంటారు. అన్ని ఆశ్రమాలకు వెళ్తుంటారు. కానీ స్వరూపానందుడికి మాత్రం ప్రియా భక్తుడు. నెలకోసారి స్వామిని దర్శించుకుని వస్తుంటారు. శిద్ధా తలపెట్టే ఏ వేడుకకి అయినా ఆ స్వామీ వారి ఆశీస్సులు ఉండాల్సిందే. అందుకే గ్రానైట్, రాజకీయ భవిష్యత్తు, ఇతర వ్యాపకాలు అన్నిటినీ ఆలోచించకుండా పార్టీ మార్పుపై స్వామిజీ మాటకు మాత్రమే శిద్దా రాఘవరావు కట్టుబడి ఉన్నారు. ఆయన ఆదేశం మేరకు వెళ్లారు, చేరారు. జగన్ కూడా ఆ స్వామికి ఎంతటి వీర భక్తుడో చెప్పాల్సిన పని లేదు. అలా ఆ ఉమ్మడి వేదిక ద్వారా శిద్దా రాఘవరావు అనే ఒక మాజీ మంత్రి, ఒక గ్రానైట్ శక్తి.., ఒక ఆర్ధిక స్తంభం… ఇలా ఎటువంటి హామీ లేకుండానే కండువా కప్పేసుకున్నారు.

గ్రానైట్ కి మరోసారి చర్చలు…!

శిద్దా చేరారు. మరి ఉన్నట్టుండి ఆయన గ్రానైట్ కంపెనీలపై ఉన్న ఫైన్ రూ. 330 కోట్లు రద్దు చేసేస్తారా…? చేయరు. అలా చేస్తే జగన్ పేరు ఢమాల్ అవుతుంది. అందుకే ఆచితూచి దీనిలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరి సారి కలిసి… పార్టీ పెద్దల ద్వారా గ్రానైట్ లావాదేవీలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రాధమికంగా తెలిసిన సమాచారం మేరకు “కోర్టుల ద్వారా మీరు పోరాడండి.., కోర్టుల ద్వారానే మీకు న్యాయం జరిగేలా మేము చూస్తాం” అని ఒక ప్రభుత్వ పెద్ద నుండి హామీ వచినట్టు తెలుస్తుంది. అప్పుడు నేరుగా ఆ మచ్చ ప్రభుత్వం పై పడదు. కోర్టులపై నెపం వేసి తప్పుకోవచ్చు. ఇలా ఇన్ని చర్చలు, సారాంశాలు, లావాదేవీలు, ఉమ్మడి వేదికల ద్వారా శిద్ధా మార్పు జరిగిందన్నమాట. ఏది ఏమైనా ఇది చంద్రబాబుకి మాత్రం మింగుడు పడడం లేదు. జిల్లాలోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ ఆ సామజిక వర్గానికి ఒక ఆర్ధిక శక్తి ఆయన. అందుకే తొలిసారి ఎమ్మెల్యే అయినా వెంటనే మంత్రినిచ్చారు. అంతకు ముందే ఎమ్మెల్సీ చేసారు, అంతకు ముందే శ్రీశైలం దేవస్థానం అప్పగించారు. పాపం… చంద్రబాబు, ఈ మార్పు మాత్రం అసలు ఊహించలేదు. అందుకే ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు తరచూ 2019 లో శిద్దాను పులి పులి అనేవారు. పులి “గాటు పెట్టి పోయిందనే” బాధలో బాబు ఉన్నారు.


Share

Related posts

ట్విట్ట‌ర్‌లో చెన్నై ఫ్యాన్స్ సంద‌డి.. ధోనీ వెల్‌క‌మ్ బ్యాక్ అంటూ పోస్టుల ట్రెండింగ్‌..

Srikanth A

Water: నీటి వృధా ని ఇలా తగ్గించండి!!

siddhu

Acharya: “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ తర్వాత అతిపెద్ద రోల్ అతనిదే నట.??

sekhar