NewsOrbit
న్యూస్

చినజీయర్ స్వామిని వివాదంలోకి లాగిన స్వాతి నాయుడు!మళ్లీ తెరపైకొచ్చిన “నేనే దేవుణ్ణి”!!

మూడేళ్ల క్రితం తాను నటించిన నేనే దేవుణ్ణి అనే సినిమాకు సంబంధించి ఇప్పుడు పోలీసులు తనను వేధిస్తున్నారంటూ శృంగార తార ,యూట్యూబ్ స్టార్ స్వాతి నాయుడు సంచలన ఆరోపణ చేయడమే కాకుండా ఈ వివాదంలోకి చినజీయర్ స్వామిని ,శివశక్తి ఛానల్ అధినేత కరుణాకర్ సుగుణ ను కూడా లాగారు.

ఒకవేళ ఆ సినిమా వివాదాస్పదమైనది అయితే దాని నిర్మించిన నిర్మాతను,దర్శకుడిని ఆ సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశం లొకేషన్ యజమానిని పోలీసులు విచారించడం మానేసి అందులో అతి చిన్న పాత్ర పోషించిన తన వెనక పడడమేమిటని ప్రశ్నిస్తూ ఆమె ఒక వీడియో విడుదల చేశారు.ఒక హిందూ భక్తి చానల్ అధినేత ఈ చిత్రాన్ని నిర్మించగా చినజీయర్ స్వామి ఆశ్రమంలో షూటింగ్ జరిగిందని ఆమె బయటపెట్టారు. స్వాతి నాయుడు ఏం చెప్పిందంటే “ఒక సీరియస్ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. గత రెండు రోజులుగా కొన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. విషయం ఏమిటంటే నేను మూడేళ్ల క్రితం ‘నేనే దేవుడ్ని’ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశా. దానికి వెయ్యో.. రెండువేలో పేమెంట్ ఇచ్చారు.

కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి ఈ సినిమా తీశాడు. యూట్యూబ్‌లో ఇప్పటికీ ఆ సినిమా ఉంది.అది జరిగిన కొన్ని రోజుల తరువాత పోలీస్‌లు మా ఇంటికి వచ్చి.. ‘నేనే దేవుడ్ని’ సినిమాలో యాక్ట్ చేశానని దానిపై కంప్లైంట్ వచ్చిందని చెప్పారు.. నాలాగ ఆ సినిమాలో వందమందికిపైగా ఆర్టిస్టులు నటించారు. మరి వాళ్లందరి ఇంటికి వెళ్లారో లేదో తెలియదు.ఇకపోతే ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగింది .ఆ ఆశ్రమం హైదరాబాద్‌కి చాలా దూరం. బైక్‌పై వెళ్లి నా రోల్ నేను చేసి వచ్చేసిన తరువాత.. పోలీసులు వచ్చి హడావిడి చేశారు. ఇంతకీ షూటింగ్ చేసింది కరుణాకర్ సుగుణ. శివశక్తి అనే ఛానల్‌ వాళ్లది. వెళ్లి వాళ్లతో మాట్లాడమని పోలీసులకు చెప్పా.వాళ్ల దగ్గరకు వెళ్లాం.. వాళ్లు పరారీలో ఉన్నారని చెప్పారు పోలీసులు. వాళ్లు పారిపోతే వెళ్లి పట్టుకోండి.. దానికి నేనేం చేయాలి. ఇదంతా జరిగి రెండేళ్లు పైనే అయ్యింది.అయితే నిన్న పోలీసులు చాలాసార్లు ఫోన్ చేసి.. స్టేషన్‌కి రావాలని అంటున్నారు. దేనికి రావాలని అంటే.. నేనే దేవుడ్ని సినిమా షూటింగ్ గురించి అంటున్నారు. నేను ఆ సినిమాలో నటించింది చిన్న రోల్.. మరి నన్ను ఎందుకు రమ్మంటున్నారో తెలియడం లేదు.

నాలాగే చాలామంది ఆ సినిమాలో నటించారు.. వాళ్లని పిలిచారా?? ఆ సినిమా షూటింగ్‌ కూడా చిన్న జీయర్ ఆశ్రమంలో జరిగింది. మరి ఆయన్ని పిలిచినారా?? సినిమా తీసిన శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణని పిలిచారా??అని స్వాతి నాయుడు ప్రశ్నించారు.ఇప్పుడు కరోనా టైంలో ఉన్నాం.. నేను చిన్న పిల్లతో ఉన్నా.. విజయవాడ వచ్చాను. బేబీని నా భర్త దగ్గర పెట్టి నేను పోలీస్ స్టేషన్‌కి వస్తాను.. అప్పుడు నాకు కరోనా వస్తే.. బేబీకి నేనే కదా పాలు ఇవ్వాల్సింది.. బేబీకి కరోనా వస్తే ఏంటి?? అని ఆమె పోలీసులను నిలదీశారు.ఇంకా చెప్పడానికి చాలా విషయాలున్నాయని స్వాతి నాయుడు చెప్పారు.ముందు సినీ నిర్మాత, దర్శకుడు,షూటింగ్ జరిగిన లొకేషన్ యజమానిని ప్రశ్నించాలని ఆమె పోలీసులకు సలహా ఇచ్చారు.అయినా నాతో ఏం పని.. ఏం పీ*నికి అని స్వాతి నాయుడు పోలీసులకు సూటి ప్రశ్న వేశారు.ప్రస్తుతం ఇది యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju