భవిష్యత్తు లో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందో లేదో ఎలాంటి టెస్టు చేయకుండా చెప్పేయొచ్చట .. అదేలాగా అనుకుంటున్నారా? కేవలం ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలట, మీకు డయాబెటిస్ ముప్పు ఉందో,లేదో తెలిసిపోతుంది..షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు హ్యాండ్ గ్రిప్ బట్టే అది తెలిసిపోతుందిట ..
ఒకవేళ చేతి గ్రిప్ వీక్ గా ఉంటే మాత్రం మీకు భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క పరీక్ష చాలు.. టైప్-2 డయాబెటిస్ వస్తుందనిహెచ్చరించడానికి. ఓ అధ్యయనం కోసం ఫిన్లాండ్, బ్రిస్టల్ సైంటిస్టులు 776 మందిని20ఏళ్ల పాటు పరీక్షించారు. కొందరు రోగులను ఎంపిక చేసుకున్నప్పుడు ఐసోమెట్రిక్ ద్వారా డైనమోమీటర్ హ్యాండిల్ ను పట్టుకుని గట్టిగా నొక్కాలని వారికి చెప్పారు . ఇలా ఐదు సెకన్ల పాటు చేయాలని తెలిపారు . వారి చేతి గ్రిప్ ద్వారా వారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఉందని నిర్ధారించామని తెలియచేసారు.
టైప్-2 డయాబెటిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం.యూకే ప్రకారంటైప్ 2 డయాబెటిస్ అంటే, డయాబెటిస్ అన్ని కేసులలో 85శాతం, 95 శాతం మధ్య ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు తగినంత ఉత్పత్తి చేయకపోతే ఈ డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ సరిగా పనిచేయనప్పుడు ఈ సమస్య వస్తుంది. మనుషులు ఎక్కువగా 40 ఏళ్ల వయస్సు నుండి టైప్ 2 డయాబెటిస్ బారిన పడి బాధపడుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం తో పాటు మంచి జీవన విధానం తో ఈ డయాబెటిస్ బారి నుంచి బయటపడొచ్చు అని తెలుపుతుంది ఈ అధ్యయనం.. అసలు దక్షిణ ఆసియాలో అయితే ఈ వ్యాధి 25ఏళ్లకే వచ్చేస్తుంది. ఈ టైప్ 2 డయాబెటిస్ పిల్లలలో, యువకులలో అంతకంతకు పెరిగిపోతోంది. ఊబకాయం వలన కూడా ఈ వ్యాధి వస్తుందని నిపుణులు తెలియచేస్తున్నారు .