గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చెందిన ముఖ్య అనుచరుడు సలివేంద్ర సురేష్ ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీదేవి ముఖ్య అనుచరుడిగా జిల్లాలో సురేష్ కు పేరుంది. సలివేంద్ర సురేష్ ను పేకాట కేసులో అరెస్ట్ చేసారు పెద్దకాకాని పోలీసులు.
వివరాల్లోకి వెళితే.. పెద్దకాకాని ఐజిఎంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కావడంతో అపార్ట్మెంట్ కు భారీగా జనం వచ్చినా ఎవరూ అనుమానించలేదు. అయితే రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్మెంట్ లో పేకాట క్లబ్ ను నిర్వహిస్తున్నాడు సలివేంద్ర సురేష్. అయితే అపార్ట్మెంట్ కు చెందిన కొందరు పెద్దకాకాని పోలీసులకు సమాచారం అందించడంతో తనిఖీలు చేపట్టి సురేష్ తో పాటు మరో 28 మందిని అరెస్ట్ చేసారు.