22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

చైనాకు భయపడేదే లే అంటూ అత్యంత ఆధునాతన యుద్ద విమానాన్ని ప్రదర్శించిన తైవాన్

Share

ఆమెరికా చట్ట సభల స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల తైపీలో పర్యటించిన నేపథ్యంలో తైవాన్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. పెలోసీ పర్యటనతో ఆగ్రహించిన చైనా .. తైవాన్ చుట్టూ సైనిక, వాయిసేన విన్యాసాలు చేపట్టి ప్రతీకార జ్వాలలు రేపింది. ఈ నేపథ్యంలో తైవాన్ .. తాము తగ్దేది లే అన్నట్లుగా తన అమ్ములపొదిలోని అత్యంత ఆధునాతన యుద్ధ విమానం ఎఫ్ – 16 వి ని ప్రదర్శించింది. ఈ యుద్ధ విమానాన్ని గగన విహారం చేయించింది.

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు.. కేంద్ర మంత్రి గడ్కరీకి ఉద్వాసన..తెలంగాణ నుండి కే లక్ష్మణ్ కు చోటు

ఈ ఎఫ్ – 16 వి ఫైటర్ జెట్ కు అమెరికా తయారీ యాంటీ షిప్ మిస్సైల్ ను కూడా అమర్చారు. పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఉన్న ఈ ఫైటర్ విమానం తైవాన్ లోని హువాలియన్ కౌంటీ వైమానిక స్థావరం నుండి గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేపట్టింది. అనంతరం మరో ఆరు ఎఫ్ 16 వి విమానాలు గాల్లో చెక్కర్లు కొట్టాయి. చైనా బెదిరింపులకు తాను అప్రమత్తంగానే ఉన్నామన్న విస్వాసాన్ని ఈ విన్యాసాల ద్వారా తైవాన్ చాటిచెప్పినట్లు అయ్యింది.

చైనాతో ఎప్పటికైనా ముప్పు తప్పదని ముందుగానే ఊహించిన తైవాన్ గత కొంత కాలంగా వాయుసేనను ఆధునీకరిస్తొంది. ఈ క్రమంలోనే కాలం చెల్లిన యుద్ద విమానాల స్థానంలో కొత్త యుద్ధ విమానాలను సమీకరిస్తోంది. గత సంవత్సరం నవంబర్ నెలలో అమెరికా తయారీ ఎఫ్ – 16 వి యుద్ధ విమానాల స్క్వాడ్రన్ ను తొలిసారిగా మోహరించింది. యుద్ద విమానాల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఎఫ్ – 16 ఫైటర్ జెట్లకు అత్యాధునిక రూపమే ఎఫ్ – 16 వి ఫైటర్ జెట్.

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. మ్యాటర్ ఏమిటంటే..?


Share

Related posts

అద్వానీ – అయోధ్య మూడు దశాబ్దాల బంధం

somaraju sharma

కాజల్ క్రేజ్ కి మరో ఆఫర్ ..ఇంపార్టెన్స్ లేకపోయినా ఒప్పుకుందా ..?

GRK

మొత్తం మీద రఘురామకృష్ణం రాజు ని పీకి పడేశారు !

sridhar