NewsOrbit
న్యూస్

రూ.60తో ఎల్‌ఐసీ పాలసీ.. ఆదాయం రూ.13 లక్షలు.. లోన్‌ కూడా ఇస్తారు..!

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తన ఖాతాదారులకు ఎన్నో భిన్న రకాల పాలసీలను అందిస్తున్న విషయం విదితమే. వాటిలో టర్మ్‌ ప్లాన్‌, ఎండోమెంట్‌ ప్లాన్‌, యాన్యుటీ ప్లాన్‌, మనీ బ్యాక్‌ ప్లాన్‌, చిల్డ్రన్స్‌ ప్లాన్‌.. అని అనేక రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పాలసీల్లో ఉన్న ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ ఆనంద్‌ ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు.

take this lic policy with rs 60 get rs 13 lakhs and loan facility

ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ ఆనంద్‌ పాలసీ వల్ల డబ్బు ఆదా అవుతుంది. కుటుంబానికి రక్షణ కూడా ఉంటుంది. బోనస్‌, రిస్క్‌ కవర్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పాలసీని తీసుకునేందుకు అర్హులు. ఇందులో భాగంగా కనీసం రూ.1 లక్ష విలువ చేసే పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గరిష్టంగా ఎంత మొత్తంతో అయినా పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్‌ 15 నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది. ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో దీన్ని తీసుకోవచ్చు. 3, 6 నెలలు లేదా 12 నెలలకు ఒకసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించేలా ఇందులో సదుపాయం ఉంటుంది. అయితే పాలసీ తీసుకుని 3 సంవత్సరాలు గడిచాక దానిపై లోన్‌ కూడా ఇస్తారు.

పాలసీ మెచూర్‌ అయ్యాక బీమా మొత్తం, బోనస్‌, ఫైనల్‌ అడిషనల్‌ బోనస్‌ వస్తాయి. ఉదాహరణకు 25 సంవత్సరాల వయస్సు ఉన్నవారు రూ.5 లక్షల బీమా మొత్తానికి 25 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే.. మెచూర్‌ అయ్యాక పాలసీదారుడు జీవించే ఉంటే.. అప్పుడు మొత్తం రూ.13.37 లక్షలు వస్తాయి. దీనికి నెలవారీ ప్రీమియం రూ.1900 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు దాదాపుగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక పాలసీ హోల్డర్‌ మరణిస్తే నామినీలకు బీమా మొత్తం, బోనస్‌ ఇస్తారు. అయితే పాలసీ తీసుకునేవారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.

author avatar
Srikanth A

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju