ఆల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని హతమార్చినట్లు అగ్రరాజ్యం అమెరికా అధినేత జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లో డ్రోన్ డ్రోన్ దాడులతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన జవహరిని మట్టుబెట్టినట్లు ప్రకటించారు. ఈ ఆపరేషన్ తో 2001 సెప్టెంబర్ 11 దాడుల బాధితులకు న్యాయం జరిగిందని బైడెన్ అన్నారు. కాబుల్ డౌన్ టౌన్ లోని ఓ ఇంట్లో ఆల్ జవహరి తన కుటుంబంతో ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి డ్రోన్ దాడి చేసి హతమార్చినట్లు పేర్కొన్నారు. అయితే జవహారి మృతిపై తాలిబన్ లు సంచలన ప్రకటన చేశారు.
జవహరి మృతి చెందలేదని తాలిబన్ లు ప్రకటించారు. జవహరి చనిపోయినట్లు ఆధారాలు లేవనీ, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈజిప్ట్ సర్జన్ అయిన ఆల్ జవహరి ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ల్లో ఒకరిగా మారారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడిలో మూడు వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రదారుల్లో అలా జవహరి ఒకరిగా అమెరికా గుర్తించింది. అప్పటి నుండి జవహరి పరారీలోనే ఉన్నాడు. అమెరికా దళాలు 2011 లో ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చి తర్వాత ఆల్ ఖైదా పగ్గాలను జవహరి స్వీకరించాడు. జవహరి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ను యూఎస్ ఇప్పటికే ప్రకటించింది.
కాబుల్ లో జరిగిన డ్రోన్ దాడిలో జవహరీ మృతికి సంబంధించి డీఎన్ఏ అధారాలు లేవని అమెరికా దృవీకరించింది. అయితే అనేక ఇతర మూలాల ద్వారా జవహరి మృతి చెందినట్లు గుర్తించినట్లు వైట్ హౌస్ తెలిపింది. అటు అమెరికా, ఇటు తాలిబన్ లు పరస్పర విభిన్న ప్రకటనల నేపథ్యంలో ఆల్ ఖైదా అధినేత జవహరి మృతి మిస్టరీగా మారింది.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…