Afghanisthan: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల షరియా చట్టాలు గురించి ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు..!!

Share

Afghanisthan: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ల సృష్టిస్తున్న నరమేధం హాట్ టాపిక్ గా మారింది. 20 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ జీవులుగా బ్రతికిన ఆఫ్ఘన్ ప్రజలు… మళ్లీ ఇప్పుడు తాలిబాన్ల పరిపాలనలోకి వెళ్ళిపోవడం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీంతో చాలామంది ఆఫ్గన్ దేశానికి చెందిన ప్రజలు దేశం విడిచి పారిపోవటానికి అనేక మార్గాలు వెతుక్కుంటున్నారు. సరిహద్దులు దాటుతూ అంటూ వెళ్ళిపోతున్న సామాన్య ప్రజలపై మరో పక్క తాలిబాన్లు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో దాదాపు చాలా ప్రాంతాలను ఆధీనంలోకి తాలిబాన్లు తీసుకోవడంతో ఇప్పుడు అక్కడ షరియా చట్టాన్ని మళ్లీ అమలులోకి తీసుకు రావటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

INDONESIA Aceh, stops public flogging: only in prison and no video

తాలిబాన్లు ఈ చట్టం తీసుకొస్తున్న క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యి దేశం విడిచి పారిపోతున్నారు. ఈ చట్టంలో శిక్షలు వింటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని అంతర్జాతీయ స్థాయిలో చాలామంది స్పష్టం చేస్తున్నారు. షరియా చట్టం అంటే.. ఇస్లామిక్ చట్టం అని అంటారు. ఖురాన్ మత గ్రంథం లో.. మనుషుల పాపాలు చేస్తే తప్పులు చేస్తే ఏ విధమైన శిక్షలు ఉంటాయో.. వాటిని అమలు చేయడమే. ఈ చట్టం బట్టి చూస్తే మతం ఏ విధంగా ఆచరించాలి, బయట సమాజంలో ప్రవర్తన ఎలా ఉండాలి..? స్త్రీ ఎలా ఉండాలి..? పురుషుడు ఏ విధంగా నడుచుకోవాలి..? అనే నియమాలు కఠినంగా ఉంటాయి. ఈ చట్టంలో కొరడాదెబ్బలు… చేతులు, కాళ్లు నరికేయడం… బహిరంగ ప్రదేశాలలో ఉరితీయడం వంటి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఇస్లాం కాదని వేరే మతాన్ని అనుసరిస్తే ఈ చట్టం ప్రకారం.. మరణ శిక్ష విధిస్తారు. ఇక దొంగతనం వ్యభిచారం చేస్తే చేతులు నరకటం తోపాటు రాళ్లతో కొట్టి చంపడం వంటివి అమలు చేస్తారు. ఇక వ్యభిచారం లో పాల్గొన్న వ్యక్తికి కచ్చితంగా వంద కొరడా దెబ్బలు అదే రీతిలో అవివాహితులు అయితే ఏడాది పాటు.. సమాజం నుండి వెలి వేస్తారు.

షరియా చట్టం రూల్స్ :-

అదే రీతిలో ఈ చట్టం ప్రకారం మగవారు గడ్డం పొడవుగా పెంచాలి అదే రీతిలో మహిళల వస్త్రధారణ.. శరీరం కనిపించకుండా ఉండాలి. ఈ నియమాలు అతిక్రమిస్తే బహిరంగంగా అవమానించడం మాత్రమే కాక కొట్టడం ఇంకా అనేక శిక్షలు విధించడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం మహిళలు ఇంటి గడప దాటకుండా.. ఫోటోలకు అదే రీతిలో వినోదాత్మకమైన కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాలి. స్త్రీ అనేది చిన్ననాటినుండే పాఠశాలలకు వెళ్ళకుండా ఉద్యమాలు చేయకుండా ఇంటిలోనే పెద్దల సమక్షంలో బతకాలి. ఆడవాళ్ళు బయటకు రావాలని అనుకుంటే మాత్రం ఇంటిలో రక్త సంబంధిత రావాలి. లేకపోతే ఆ మహిళ పై షరియా చట్టం ఉపయోగిస్తారు. అక్రమ సంబంధాలకు పాల్పడిన జంటలను రాళ్లతో కొట్టి చంపుతారు. దోపిడీలకు పాల్పడితే చేతులు నరికి వేస్తారు. 20 సంవత్సరాల క్రితం ఈ తరహాలో ఆఫ్గనిస్థాన్ దేశంలో తాలిబాన్లు షరియా చట్టాన్ని అమలు చేయటంతో… ప్రజలు బిక్కుబిక్కుమని భయపడిపోతున్నారు. గత పరిపాలనకు ప్రజెంట్ పరిపాలనకు అసలు పొంతన లేకుండా ప్రజలు బతకడం తో షరియా చట్టం మళ్లీ తాలిబాన్లు తీసుకు వస్తున్న నేపథ్యంలో… ఇప్పటిదాకా స్వేచ్ఛ జీవులుగా బ్రతికిన తాలిబాన్ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి పారిపోతున్నారు.

తాలిబాన్లు విధించే కఠినమైన శిక్షలు :-

తాలిబాన్లు విధించే కఠినమైన శిక్షలు తట్టుకోలేమని చాలా మంది కుటుంబ సభ్యులు.. కన్నీరుమున్నీరవుతున్నారు. మరోపక్క తాలిబాన్లు విచ్చలవిడిగా దేశంలో సామాన్య ప్రజలను ముఖ్యంగా ఆడవారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. దీంతో ఆ దేశంలో తాలిబాన్లు సృష్టిస్తున్న నరమేధం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క ప్రపంచంలో అగ్రదేశాలు తాలిబాన్లు వెనక్కి తగ్గాలని మళ్లీ అక్కడ ప్రజాస్వామ్య దేశాన్ని నెలకొల్పాలని.. అటు ఇటు గా ఉన్న అక్కడ ప్రభుత్వాన్ని కాపాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఆఫ్గనిస్థాన్ దేశంలో షరియా చట్టాలు అమలు చేయాలని తాలిబాన్లు.. రెడీ అవుతున్న క్రమంలో అక్కడి దేశ ప్రజలు.. దేశం విడిచి పారిపోతున్నారు.


Share

Related posts

ఎన్‌ఐఎ కోర్టుకు ‘కోడికత్తి’ నిందితుడు

Siva Prasad

‘దేశాన్ని దోచుకుంది మీ కుటుంబ సభ్యులే’

somaraju sharma

మోడీ తర్వాత జగన్ : సరికొత్త రికార్డ్ నమోదు చేసిన ఆంధ్ర సీఎం

Special Bureau