టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు తమన్. గత ఏడాది అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురంలో” సినిమా కి అదిరిపోయే సాంగ్స్ ఇవ్వటమే కాక సోషల్ మీడియాలో అనేక రికార్డులు సాధించాడు. సినిమా పరంగా కంటే సాంగ్స్ పరంగా “అలా వైకుంఠపురంలో” మంచి పాజిటివ్ టాక్ ముందే తెచ్చుకోవటంతో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నడు. పవన్ – రానా కలిసి నటించబోయే ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కు తమనే సంగీతం అందిస్తున్నాడు. అంతేకాకుండా మహేష్ సర్కారు వారి పాట, త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఆఫర్లు దక్కించుకున్న తమన్ ఫస్ట్ టైం చిరంజీవి సినిమా కి మ్యూజిక్ అందించడానికి బంపర్ ఆఫర్ కొట్టడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశాడు.
తన డ్రీమ్ నెరవేరింది అంటూ చెప్పుకొచ్చాడు. పూర్తి విషయంలోకి వెళితే చిరు ‘లూసిఫర్’ కు సంగీతం అందించే చాన్సు తనకి వచ్చినట్లు తమన్ స్వయంగా బయటపెట్టాడు. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు నాకు టైం వచ్చింది, మోహన్ రాజాకి కృతజ్ఞతలు అంటూ తమన్ ట్వీట్ చేశారు.