Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి యేమని చెబుతాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అమ్మడు దున్నేస్తోంది. ఆమె అడుగుపెట్టిన ప్రతి భాషలోనూ తమన్నా దుమ్ము లేపుతోంది. అదిరే గ్లామర్ తో, అద్భుతమైన డాన్స్ తో ఆమె ప్రేక్షకులను కనువిందు చేస్తోంది. చిన్న హీరోలనుండి పెద్ద హీరోల వరకు ఎవ్వరినీ వదిలి పెట్టకుండా అమ్మడు బాగానే కవర్ చేసింది. ఇక ఆమెకున్న ప్రత్యేకమైన ఆకర్షణ మేనిఛాయ. అదేనండి స్కిన్ టోన్.. అలంటి స్కిన్ టోన్ వున్న కథానాయిక ఇక్కడ లేదనే చెప్పుకోవాలి.
Tamannaah : భారీ డిమాండ్.. భారీ రెమ్యునరేషన్!
ఇకపోతే కొత్త కథానాయికల వలన ఆమెకి అవకాశాలు తగ్గినప్పటికీ, ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది తమన్నా. సాధారణంగా అవకాశాలు తగ్గుతున్నప్పుడు పారితోషికం పెంచే సాహసం ఎవరూ చేయరు .. కానీ తమన్నా మాత్రం తన పారితోషికాన్ని రెట్టింపు చేయడం కొసమెరుపు. ఇంతవరకూ ఒక్కో సినిమాకి 2 కోట్లు తీసుకుంటూ వచ్చిన ఆమె ఇప్పుడు ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేయడం ఒకింత ఆశ్చర్యకరమే మరి!
కారణం ఇదే..
తాజా బాలీవుడ్ చిత్రమైన ‘బబ్లీ బౌన్సర్’ సినితో ఆమె తన పారితోషికాన్ని రెట్టింపు చేసింది. హిందీలో ఆమె గ్లామర్ కి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం చేత ఇంత డిమాండ్ వుంది. ఇక మధుర్ భండార్కర్ కూడా ఆమెను అందుకే ఎంచుకున్నాడు. ఇండియాలో తొలి మహిళా బౌన్సర్ కథ ఆధారంగా ఫాక్స్ స్టార్ – జంగ్లీ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. బాక్సర్స్ టౌన్ గా ప్రసిద్ధి చెందిన అసోలా ఫతైపూర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా నిన్ననే పూజా కార్యక్రమాలను జరుపుకొని షూటింగ్ జరుపుకుంటోంది.