NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Vijay : ఓటు వేసేందుకు సైకిల్ పై విజయ్..! నిరసనా.. లేక ఫ్యాన్స్ కు సిగ్నలా..!?

tamil hero vijay on cycle to vote

Vijay : విజయ్ Vijay తమిళ స్టార్ హీరో విజయ్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిట్ ఫ్లాప్ కు అతీతంగా కలెక్షన్లు వస్తూంటాయి. రజినీకాంత్ తర్వాత విజయ్ సినిమాలకు ఆస్థాయి మార్కెట్ ఉంది. ఇళయ దళపతిగా భారీ ఫ్యాన్ బేస్ విజయ్ సొంతం. ఈరోజు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే విడతలో జరుగుతున్న ఎన్నికలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలు కూడా ఓటింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. అయితే.. ఓటు వేసేందుకు కారులో రావాల్సిన విజయ్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటి నుంచి సైకిల్ పై ఓటు వేసేందుకు బయలుదేరాడు. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడులో సంచలనం రేపింది.

tamil hero vijay on cycle to vote
tamil hero vijay on cycle to vote

అయితే.. విజయ్ ఇలా సైకిల్ పై రావడానికి కారణం బీజేపీ వ్యతిరేకినని చెప్పకనే చెప్పినట్టు అని వార్తలు వస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా తన నిరసన ఇలా తెలియజేశాడని కూడా అంటున్నారు. రాజకీయాలపై నోరు విప్పని విజయ్.. ఇలా సైకిల్ పై వచ్చి బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి ఓటు వేయొద్దని ఫ్యాన్స్ కు తన చర్య ద్వారా చెప్పాడని అంటున్నారు. ఇదే నిజమైతే విజయ్ మాటను ఫ్యాన్స్ పాటిస్తే అన్నాడీఎంకే-బీజేపీకి కాస్త దెబ్బ పడినట్టే. కారణం.. విజయ్ పై ఐటీ రైడ్స్ చేయించి చాలా ఇరుకున పెట్టారు. మెర్సల్ సినిమాలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటం ఇందుకు కారణమనే వాదనలూ వినిపించాయి.

ఈక్రమంలోనే విజయ్ ఇలా సైకిల్ పై వచ్చి తాను చెప్పాలనుకున్నది చెప్పాడని అంటున్నారు. విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్, క్రేజ్ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని కూడా వార్తలు వచ్చాయి. పలు ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై బ్యానర్లు కూడా కట్టేశారు. వారిని తన ఫ్యాన్స్ కాదని.. వారి సభ్యత్వాలను కూడా రద్దు చేయించాడు విజయ్. అయితే.. విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. విజయ్ కు ఇందులో సంబంధం లేదని అన్నారు. మొత్తానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి విజయ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

author avatar
Muraliak

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?