ఏపీ మంత్రి ఇచ్చిన స్ట్రాంగ్ డోస్ తో లైన్ లో పడ్డ తమిళనాడు..!!

పండుగ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించింది. ఏపీకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులను తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆర్టీఏ అధికారులు ఆపేసి నానా హడావిడి చేయడం జరిగింది. దీంతో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విషయం తెలుసుకుని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్మిట్లు లేని తమిళనాడు రాష్ట్రానికి చెందిన 24 బస్సులను ఆపేశారు.

Chandrababu Living In Imaginary World: Perni Naniదీంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన అధికారులు కొద్దిగా తగ్గి.. ఏపీకి చెందిన అధికారులతో చర్చలు జరపడంతో 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చర్చలు సఫలం కావడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేతలకు ప్రైవేటు ట్రావెల్స్ ఉన్న నేపథ్యంలో.. వాటికి లాభం చేకూర్చడానికి అక్కడ రాష్ట్ర ఆర్టీఏ అధికారులు చేసిన ఓవరాక్షన్ అని.. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని ఇచ్చిన డోస్ కి… తమిళ ప్రభుత్వ అధికారులు దిగి రావాల్సి వచ్చింది.

 

ఏది ఏమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు సఫలం కావడంతో పెద్ద వివాదం ఏం కాలేదు.