న్యూస్ సినిమా

తమిళ సూపర్ స్టార్ కు హైదరాబాద్ లో రోడ్ సైడ్ ఇడ్లీ తెగ నచ్చేసింది… బండి ఓనర్ లైఫ్ టర్న్ అయింది..!

Share

తమిళ సూపర్ స్టార్ నటుడు అజిత్ తన రాబోయే చిత్రం ‘వాలిమై’ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తుండగా ఒకసారి అజిత్ అనుకోకుండా హైదరాబాదు లో రోడ్ సైడ్ ఫుడ్ తింటే అది కాస్త విపరీతంగా నచ్చేసింది. అంతే ప్రతిరోజూ ఆ రోడ్ సైడ్ న ఉండే అదే ఇడ్లీ బండి నుండి టిఫిన్ తెప్పించుకొని మరీ తినేవారట.

 

ఇక ఇలా అంత అద్భుతంగా ఇడ్లీలు చేసిన వ్యక్తిని పిలిచి అతని కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నాడట అజిత్. ఆ ఇడ్లీ బండి వ్యక్తి తన పిల్లలకు చదువు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పడంతో వారి చదువుకు కావలసిన సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఇడ్లీ బండి వ్యక్తి పిల్లల చదువుకోసం అజిత్ లక్ష రూపాయలను సాయంగా అందించాడని చెబుతున్నారు.

అలా అజిత్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అని పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి పనులు అజిత్ గతంలో చాలానే చేశాడు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇక అజిత్ నటిస్తున్న చిత్రానికి ‘వాలిమై’ చిత్రం విషయానికి వస్తే…. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Share

Related posts

Acharya: బిజినెస్‌లో దుమ్ముదులిపేస్తున్న `ఆచార్య‌`..మెగా హీరోల టార్గెట్ ఎంతంటే?

kavya N

Kcr : కుటుంబ సమేతంగా వారణాసిలో కేసిఆర్, కారణం అదేనా..??

sekhar

Mahesh : మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన మోనాల్ గజ్జర్ ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar