తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో మిస్టరీ ఛేదించిన సీబీఐ

 

(చెన్నై నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి )

 పోలిసుల ఆరు గంటల పాటు చేసిన చిత్ర హింసల వలనే తండ్రి కొడుకులు మరణించారు అని సిబిఐ విచారణలో తేలింది. వివరాలలోకి వెళితే చెన్నై లో జూన్ 19 న కర్ఫ్యూకు మించి 15 నిమిషాల పాటు తమ మొబైల్ ఫోన్ షాపును తెరిచి ఉంచినందుకు జయరాజ్ ను పోలీస్ లు అరెస్ట్ చేసారు, తన తండ్రి కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన కొడుకు బెన్నిక్స్, ని కూడా పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారు. ఆ తరువాత జూన్ 22 న కస్టడీ లో ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు గాయాలతో కొని గంటల వ్యవధి లోనే మరణించడం చర్చనీయాంశయం అయింది. అప్పటిలో దేశవ్యాప్తంగా సంచలనం ఆయినా ఈ కేసు ను తమిళనాడు ప్రభుత్వం సిబిఐ కి అప్పగించింది.

తాజాగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు బయటపడ్డాయి. ఈ కేసు ను దర్యాప్తు చేసిన సిబిఐ చార్జిషీట్లో “సాయంత్రం 7.45 నుండి ఆర్ద్రాత్రి 3 గంటల మధ్య విరామాలతో ఇద్దర్ని అనేక రౌండ్ల కర్రలతో కొట్టి దారుణ హింసకు గురిచేసారు” అని చెప్పారు. ఇద్దరి వ్యక్తుల రక్తపు మరకలను సంతంకుళం పోలీస్ స్టేషన్ గోడలపైన ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. పోలీసులు సాక్ష్యాల్ని ధ్వంసం చేయడానికి రక్తపు మరకలతో ఉన్న జయరాజ్ చొక్కాని బెన్నిక్స్, చొక్కాతో గోడల పైన ఉన్న రక్తపుమరకల్ని తుడిచి వాటిని ప్రభుత్వ ఆసుపత్రి డస్ట్బిన్ లో వేసినట్లు సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నది .నేరాన్ని కప్పిపుచ్చడానికి బెన్నిక్స్, జయరాజ్ లపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సిబిఐ తెలిపింది. ఇద్దరూ లాక్డౌన్ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని దర్యాప్తులో తేలింది .ఇద్దరిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న రోజు సిసిటివి ఫుటేజ్ లేదు. సిస్టమ్ హార్డ్ డిస్క్‌లో తగినంత నిల్వ స్థలం ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్‌లోని భద్రతా కెమెరాలను ప్రతిరోజూ ఫుటేజ్‌ను ఆటో-డిలీట్ చేయడానికి ప్రోగ్రామ్ చేసినట్లు కోర్టుకు మేజిస్ట్రేట్ చెప్పారు.పోలీసుల దారుణ చిత్రహింసలు కారణంగానే జయరాజ్ మరియు తన కొడుకు బెన్నిక్స్ చనిపోయారు అని సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది.