తనికెళ్ల భరణి.. వెర్సటైల్ యాక్టర్. ఒక తండ్రిగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, రచయితగా.. ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషించి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన నటుడిగా కూడా ఎంతో సక్సెస్ అయ్యారు. ఎక్కువగా తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

తాజాగా తనికెళ్ల భరణి.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో గెస్ట్ గా వచ్చారు. కమెడియన్ ఆలీతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు.
ఆలీ, తనికెళ్ల.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. దీంతో.. అది ఒక ఇంటర్వ్యూలా కాకుండా.. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సరదా సంభాషణలా సాగింది.
అయితే.. ఈ ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణికి సంబంధించిన ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. తనికెళ్ల భరణి.. అసలు తెలుగు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు. నాటకాలు వేసుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని.. అలాగే రచయితగా మారి.. ఎన్నో సినిమాలకు మాటలు రాసిన ఘనత తనికెళ్ల భరణిది.
నిజానికి తనికెళ్ల భరణికి విలన్ వేషాలంటేనే ఎక్కువగా ఇష్టం అట. విలన్ గా, నెగెటివ్ పాత్రల్లో నటించడమంటేనే ఇష్టం అట. అందుకే.. ఏ సినిమాలో చాన్స్ వచ్చినా.. విలన్ వేషాలు ఇవ్వాలంటూ దర్శకులను కోరేవారట. ఆయన విలన్ గా చేసిన చాలా సినిమాలకు ఆయనకు అవార్డులు వచ్చాయి. నువ్వునేను, సముద్రం లాంటి సినిమాలకు బెస్ట్ విలన్ గా అవార్డులు కూడా వచ్చాయి.
మరి.. తనికెళ్ల భరణి గురించి ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఆయన ఇంటర్వ్యూను చూసేయండి..