ముంబాయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రుజువు చేసేందుకు ఎటువంటి సాక్షాధారాలు లేవని ముంబాయి పోలీసులు గురువారం కోర్టుకు వెల్లడించారు. దర్యాప్తును కొనసాగించలేకపోతున్నామని తెలియజేశారు. దీంతో కోర్టు పటేకర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.
పదేళ్ల క్రితం నానా పటేకర్ ఒక సినిమా సెట్లో తనను లైంగికంగా వేధించారని సహ నటి తనుశ్రీ దత్తా ఏడాది క్రితం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఖండించిన పటేకర్ వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పాలంటూ తనుశ్రీదత్తాకు లీగల్ నోటీసు కూడా ఇచ్చారు.