Tapsee : టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఇక్కడ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కలేదు. అయినా లక్కీగా బాలీవుడ్ లో తాప్సీ కి అవకాశాలు వచ్చాయి. ప్రారంభంలో కాస్త గ్లామర్ రోల్స్ చేసింది. అయితే అక్కడ తాప్సీ క్రేజ్ పెరిగింది మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో చేసిన పింక్. ఈ సినిమా బాలీవుడ్లో తాప్సీ స్టార్ మార్చేసింది. దాంతో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని స్టార్‌గా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో మళ్ళీ సినిమాలు చేయడానికి తీరిక కుదరలేదు.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేసేందుకు డేట్స్ ఇచ్చింది. ఈ సినిమాను ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడు. ‘మిషన్ ఇంపాజిబుల్’ టైటిల్ తో మంచి కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా తిరుపతికి దగ్గర ఉన్న ఓ గ్రామంలో జరిగే షూటింగ్ మూవీ అని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో డైరెక్టర్ స్వరూప్ కూడా ఓ డిటెక్టివ్ గా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.
Tapsee : ఇలాంటి పాత్ర తాప్సీ గతంలో ఎప్పుడు చేయలేదు.
ఇక తాప్సీ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ తాప్సీ జాయిన్ అయినట్లు చిత్ర బృందం రీసెంట్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలో తాప్సీ పోషిస్తున్న పాత్ర గురించి టాప్ సీక్రెట్ రివీల్ అయింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంలో తాప్సీ ఓ స్వతంత్ర జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుందట. ఇలాంటి గతంలో ఎప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు పోషించిన పాత్రలకి పూర్తి భిన్నమైన పాత్ర కావడంతో ఈ సినిమా చేసేందుకు తాప్సీ ఒప్పుకుందని అంటున్నారు.