Taraka Ratna: తారకరత్న మరణంతో నందమూరి కుటుంబం తీవ్ర ఆవేదనలకు లోనవుతుంది. అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి తారక రత్నా కన్నుమూశారు. దీంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తట్టుకోలేకపోయింది. ఆమె కూడా అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారట.

భర్త దూరమయాడన్న బాధలో అలేఖ్య రెడ్డి తీవ్రంగా విలపించింది. నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను ఓదార్చిన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆమెతోపాటు తారకరత్న పిల్లలు కూడా కన్నీరు మున్నీరువుతున్నారు. ఈ క్రమంలో అస్వస్థత లోను కావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. మరోవైపు గత రెండు రోజులుగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి ఆమె ఆహారం కూడా తీసుకోలేకపోయిందని సమాచారం.
ఈ విషయమే గురించి స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి .. ఆమెకు అంత మానసిక ఒత్తిడికి లోనే ఉందని చెప్పారు. అయితే అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమితంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం చిన్న విషయం కాదని.. కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయని అన్నారు.