మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు కంప్లీటయిందని సమాచారం. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒంగోలులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడు గోపిచంద్ మలినేని. ఈ సినిమా సక్సస్ మీద రవితేజ, గోపిచంద్ మలినేని, శృతిహాసన్ చాలా నమ్మకంగా ఉన్నారు.
ఇక ఈ సినిమా తరువాత రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షసుడు సినిమా తీసి హిట్ కొట్టిన రమేష్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుండగా… హీరోయిన్స్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఫాం లోకి వచ్చిన నిధీ అగర్వాల్, నభా నటేష్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నభా నటేష్ స్థానంలో రాశి ఖన్నాను ఎంచుకున్నట్టు తెలుస్తుంది.
గతంలో రవితేజ తో రాశి ఖన్నా కాంబినేషన్ లో బెంగాల్ టైగర్ వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు యావరేజ్ సినిమాగా మిగిలింది. ఇప్పుడు మరోసారి రవితేజ రాశీ ఖన్నా కాంబినేషన్ రిపీటవుతుంది. ఇక ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాటు నేను లోకల్ ఫేం త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందనుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమా కథ ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది.