NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: అసలే కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు కొత్తగా మరో మూడు తలనొప్పులు..!?

TDP: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ చాలా గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో మునుపెన్నడూ చవి చూడని విధంగా ఘోర పరాజయం ఎదురుకావడంతో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉన్న అది పెద్ద సవాల్. షెడ్యుల్ ప్రకారంలో ఏపి అసెంబ్లీ ఎన్నికలు 2024 జరగాల్సి ఉండగా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. వయసు పైబడటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన రాజకీయంగా రిటైర్ మెంట్ తీసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో చేసిన శపథం నెరవేర్చుకునేందుకు ఇప్పటి నుండి స్ట్రాటజీలకు పదును పెడుతున్నారు. అయితే చంద్రబాబుకు ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు నల్లేరుపై నడక ఏమీకాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తారన్న విమర్శ కూడా ఉంది. గత ఎన్నికల్లో మాదిరిగా త్రిముఖ పోటీ జరిగితే టీడీపీ అధికారంలోకి రావడం కష్టమే అన్న అభిప్రాయం ఇటు టీడీపీ, అటు జనసేన వర్గాల్లోనూ ఉంది.

TDP chief chandrababu new headache
TDP chief chandrababu new headache

 

TDP: 50 స్థానాలను త్యాగం త్యాగం చేయాల్సిందేనా..?

ఈ నేపథ్యంలో అధికార పక్షం వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఉమ్మడిగా పోటీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయన్నది టాక్. అయితే చంద్రబాబు గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి నామమాత్రంగా సీట్లు కేటాయించే వాళ్లు. ఇప్పుడు జనసేనతో పొత్తు విషయానికి వస్తే ఆ పార్టీకి ఎక్కువగానే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇది పార్టీకి, చంద్రబాబుకు పెద్ద సమస్యేనని అంటున్నారు. దాదాపు 50 నుండి 70 స్థానాల్లో గెలుపు ఓటములను నిర్ధేశించే స్థాయిలో కాపు సామాజికవర్గం ఉన్నందున జనసేనకు 30 నుండి 50 స్థానాలు అడిగే అవకాశం ఉంటుంది. జనసేన, వామపక్షాలకు కు కేటాయించే స్థానాల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించే నాయకులను బుజ్జగించడం, ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లను సముదాయించడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పేనని అంటున్నారు. అయితే చంద్రబాబు ఇవన్నీ ఆలోచించే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను నియమించకుండా నెట్టుకువస్తున్నారన్న మాట కూడా వినబడుతోంది. దాదాపు 50 స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు తెలియజెప్పి ఇప్పటి నుండే వాళ్లను మాసికంగా సిద్దం చేయాలని చూస్తున్నారట. చూడాలి ఏమి జరుగుతుందో.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju