NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం నియోజకవర్గంలో టీడీపీ ఆందోళన ఎఫెక్ట్ !ఎస్సీ లపై కూడా అట్రాసిటీ కేసు నమోదు!!వాటే వండర్?

ఇదో విచిత్రమైన కేసు!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మృతిచెందగా దానిపై ఉద్యమించిన 21మంది తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసు నమోదైంది.

ఏ మహిళకయితే న్యాయం జరగాలంటూ టిడిపి నేతలు ఆందోళన సాగించారో ఆ మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మీదనే ఈ కేసు నమోదు కావటం ఇంకా ఆసక్తికరమైన విషయం. అది కూడా రహస్యంగా జరగడం విశేషం.ఈ కేసులో టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్టు చేసేంతవరకు అసలు కేసు నమోదైన విషయమే టిడిపి నేతలకు తెలియదంట.

అసలేం జరిగిందంటే?

పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాలలో దళిత మహిళ హత్యపై సరైన న్యాయం జరగలేదంటూ టీడీపీ ‘చలో పులివెందుల’ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కేసులో అసలైననిందితులను వదిలేశారని ప్రచారం జరగడంతో నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిసెంబరు 19న టీడీపీ ర్యాలీ నిర్వహించి, డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమను అవమానించారంటూ మృతురాలి బంధువులు అదే నెల 21న ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

గోప్యంగా కేసు నమోదు

అయితే పులివెందుల పోలీసు స్టేషన్‌లో 21 మంది టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేత శ్రీరెడ్డి, కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, ఎస్సీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడుఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డితో పాటు విజయకుమార్‌రెడ్డి, గురప్ప, జయచంద్ర, హరిక్రిష్ణ, జింకా శ్రీను, బండి జయశేఖర్‌, అశోక్‌, కుళ్లాయప్ప, సుదర్శన్‌, నారాయణ తదితరులపై కేసు నమోదైంది.ఈ కేసులో బీటెక్ రవిని చెన్నైలో ఆదివారం పోలీసులు అరెస్టు చేయడంతో అసలు వారిపై కేసు నమోదైన విషయం బయటపడింది

మళ్ళీ పోలీసులు పప్పులో కాలేశారా!

ఇదిలా ఉండగా ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపై కూడా అట్రాసిటీ కేసు నమోదు కావడం విశేషం.అనిత కూడా ఎస్సీనే అయినప్పటికీ ఆమెపై ఈ కేసు ఎలా పెట్టారన్నది పోలీసులే చెప్పాలి.గతంలో రాజధానిలో కొందరు ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టి పోలీసులు విమర్శల పాలవడం తెలిసిందే.

అక్రమ కేసులకు భయపడేది లేదు

అరెస్టులు కొత్త కాదని, ఇలాంటి కేసులకు భయపడేదిలేదని ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పష్టం చేశారు. పార్టీ కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు. అంతర్జాతీయ నేరస్థుడిలా వెంటపడి పట్టుకున్నారని మండిపడ్డారు. దేశం విడిచి పారిపోతున్నట్లు వెంబడించి పట్టుకోవడం భావ్యం కాదని బీటెక్ రవి అన్నారు. ఘటన జరిగి రెండు వారాలైంది.. కేసు గోప్యంగా ఉంచారని చెప్పారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపైనా అట్రాసిటీ కేసు పెట్టడం వింతగా ఉందని బీటెక్ రవి తప్పుబట్టారు.

 

author avatar
Yandamuri

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju