NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు సెటైర్ కార్నర్

బాబు గారు..!! మీకర్ధమవుతుందా..??

సీన్ – 1 : “కార్యాలయంలో చుట్టూ జనాలున్నారు. చంద్రబాబు సీట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. లోకేష్ నాయకులతో మాట్లాడుతున్నారు. మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలు, మాజీలు కార్యాలయం లోపల బాబు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరికి వారు సొంత సర్వే నివేదికలు సిద్ధం చేసుకుని తలుపు దగ్గర వేచి చూస్తున్నారు. అప్పుడు వచ్చింది బిజెపి నుండి కబురు… “మాకు మీరిచ్చిన స్థానాలు సరిపోవు, ఇంకా పెంచాలి” అని. ఇటు జనసేన కూడా అదే పట్టు పడుతుంది. సరే ఎలా”గోలా” సర్దుబాటు చేసుకుందామని బాబు, పవనూ ఒప్పందం మాట్లాడుకుంటున్నారు…!

సీన్ – 2 : చంద్రబాబుని కలిసేందుకు కొందరు వైసిపి నాయకులూ వచ్చారని కబురు అందింది. “ఆహ ఎంత చల్లని కబురు, నన్ను కలవడానికి వైసిపి వాళ్ళు రావడమా” అంటూ బాబు ఆరాతీస్తూనే… ఏదో అనుమానంతో కిటికీ లోపలి నుండి తొంగి చూసారు. అప్పుడు కనిపించింది వాళ్ళందరూ తన పార్టీ నుండి వెళ్లిపోయిన నాయకుల్లో కొందరు అని… నిజానికి ఇష్టం లేదు. కానీ తప్పదు. పోటీకి అభ్యర్థులు కావాలి. ఉన్న వాళ్లకు గెలిచే సత్తా ఉండడం లేదు. అందుకే అధికార పార్టీ నుండి అధికారాన్ని అనుభవించి వచ్చిన వారు అయితే బాగుంటుంది” అని తలచిన బాబు ఎలా”గోలా” సర్దుబాటు చేసుకుని వాళ్ళను పార్టీలో చేర్చుకున్నారు.

సీన్ – 3 : బాబు, లోకేష్, యనమల, టిడి జనార్దన్… లాంటి సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. టికెట్ల కేటాయింపు ఎలా..? ప్రచారం ఎలా..? ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి..? ఆర్ధిక సర్దుబాట్లు ఎలా..? అనేది మాట్లాడుకుంటున్నారు. ఈ లోగా కొందరు నాయకుల నుండి మళ్ళీ కబురు వచ్చింది. ప్రచార బాధ్యతలు నుండి లోకేష్ ని తప్పించాలి అని. మీరు తగ్గాలి అని, జూనియర్ ని దించాలి అని… ఈ మూడు కండీషన్లుతో కొందరు సీనియర్ నాయకులు, అభ్యర్థులు, భాగస్వామ్య పక్షాల నుండి ఒత్తిళ్లు వచ్చాయి. కొందరు దూతల ద్వారా జూనియర్ కి రాయబారం పంపించాలి అని అనుకున్నారు. “బాబు మనసులోనే అప్పటికే ఒక విషయం దాగి ఉంది. అక్కడికి ఏడాది ముందు నుండే తాను జూనియర్ ని ప్రచారానికి వాడుకుందామని.., కలుపుకున్న పని జరగలేదు అని” బాబుకి, లోకేష్ కి మాత్రమే తెలుసు. కానీ అది పైకి చెప్పలేక కొందరు నాయకులను రాయబారానికి పంపించాలి అని.., వారి మాట కాదనలేక ఎలా”గోలా” బతిమాలి తీసుకురావాలని కోరారు.

“ఇదేమిటి..?? ఇదేమైనా ఎన్నికల సమయమా..? ఈ రాతలేంటి..? ఈ గోల ఏంటి? అనుకుంటున్నారేమో. కన్ఫ్యూజ్ కావద్దు. 2024 నాటికి టిడిపిలో విషయం ఇదే. మిగిలేది ఇదే. ఎందుకు..? అంతలా ఎలా చెప్పగలరు..? అనుకుంటారేమో…!! ఇప్పుడు జరుగుతున్నా రాజకీయానికి, కదలికలకు, పై మూడు పేరాలకు లింకులున్నాయి.

ఒకటో లింకు – జగన్ ఆంధ్రాలో బలపడితే బిజెపికి లోంగే రకం కాదు. బాబుకి భుజాలు విరిచేసి.., గోతులన్నీ తవ్వేసి.., లోకేశుడి పాపాలన్నీ తోసేసి… ఒంటరిని చేసేసి… వారి బలమైన సామజిక వర్గాన్ని లాగేసి… వాళ్ళు పఠిస్తున్న “కమ్మ – కాపు” మంత్రం వెనుక ఉద్దేశం ఆరాతీస్తే ఇక మిగిలేది ఆ పొత్తులే. ఆ ప్రత్యామ్నాయాలే.

రెండో లింకు – చేరికల్లో జగన్ వాళ్ళు, వీళ్ళు అని చూడడం లేదు. తన, మన బేధం లేకుండా చంద్రబాబుని తిట్టే ఎవ్వరిని అయినా కండువా కప్పేసి, రప్పించేసుకుంటున్నారు. ప్రస్తుతానికి అధికారం ఉంది, నామినేటెడ్ అనే బెల్లం ముక్క చేతిలో పెట్టినా ఎన్నికల సమయానికి మాత్రం అందరికి ఎమ్మెల్యే స్థానం అనే తేనె పట్టు కావాలి. అది సర్దుబాటు చేయలేక, అందరికీ ఇవ్వలేక, మిగిలిన వ్యర్ధాలు వెళ్ళేది టిడిపి వైపే. అంటే టిడిపి నుండి వచ్చిన వారిలో చాల మంది మళ్ళీ అటే వెళ్తారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అది “రాజీ”కీయం కాబట్టి.

మూడో లింకు : లోకేష్ ని గడిచిన ఎన్నికల్లోనే ప్రచారానికి దించలేదు. ఇప్పటికీ మాట్లాడడం రావడం లేదు. బాబు గడిచిన ఎన్నికల్లో పస లేని ప్రసంగంతో విసిగించారు. చెప్పిందే చెప్పి, తిట్టిందే తిట్టి చేదు పుట్టించారు. అందుకే ఆ పార్టీకి సరైన వక్త… ప్రచార కర్త, కర్మ, క్రియ కావాలని పార్టీలో ఇప్పటి నుండి అంతర్గత చర్చ జరుగుతుంది. అది బాబుకి తెలుసు, దీనికి సమాధానం జూనియర్ మాత్రమే అని అందరికి తెలుసు.

అర్ధమయ్యిందిగా. లింకుల రాజకీయం. ఇక్కడితో ఆగదు. టిడిపి నాయకుల ప్రస్తుత మాటలు, జగన్ వ్యవహారం, పార్టీల మార్పులు అన్ని చూస్తుంటే ఇంతకు మించి ఉన్నా ఎలా”గోలా” కానిచ్చేస్తారని మాత్రం పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చన్నమాట. మీకర్ధమవుతుందా…???

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju