TDP : దేశంలో అత్యధిక పార్లమెంట్ సభ్యులు కలిగిన విషయంలో దేశంలో నాలుగో స్థానంలో వైసిపి ఉందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల పరంగా బాగా డబ్బులు వెనకేసుకున్న పార్టీల జాబితా.. చేయ పార్టీలకు ఎంత డబ్బులు ఉన్నాయి ఎన్ని ఆస్తులు కూడబెట్టారు అన్నదానిపై ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) అనే సంస్థ తాజాగా ఓన్లీ స్టార్ రిలీజ్ చేసింది. జాతీయ పార్టీల ఆస్తులను అదేవిధంగా ప్రాంతీయ పార్టీల ఆస్తులను వెల్లడి చేసింది.
ఈ లిస్టు ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా డబ్బులు కలిగిన ఆస్తులు కలిగిన ప్రాంతీయ పార్టీగా టిడిపి మొదటి స్థానంలో నిలిచింది. ఓవరాల్ దేశ పరంగా చూసుకుంటే నాలుగో టాప్ మోస్ట్ స్థానంలో టిడిపి ఉంది. (ఏడీఆర్) నివేదిక ప్రకారం తెలుగుదేశం పార్టీకి 193 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీకి 188 కోట్ల ఆస్తులు ఉన్నట్లు దేశీయ పరంగా ఆరో స్థానంలో టిఆర్ఎస్ పార్టీ ఉండగా 93 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8వ స్థానంలో నిలిచింది.
అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా 572 కోట్ల రూపాయలతో సమాజ్ వాదీ పార్టీ నిలిచింది. రెండోస్థానంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన నవీన్ పట్నాయక్ బీజేడీ నిలిచింది. 232 కోట్ల రూపాయలు కలిగిన పార్టీగా బీజేడీ లిస్టు లో నిలిచింది. ఇక మూడో స్థానంలో రెండు వందల ఆరు కోట్ల రూపాయలతో అన్నాడీఎంకే పార్టీ తన స్థానం సుస్థిరం చేసుకుంది. జాతీయ పార్టీల పరంగా చూసుకుంటే బిజెపి మొదటి స్థానంలో ఉంది. ఆ పార్టీకి 2904.18 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ రూ.928.24కోట్ల ఆస్తుల లో నిలిచింది.